Page Loader
భారత్, కెనడా సంబంధాల్లో 'స్వరం మారింది' : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
భారత్, కెనడా సంబంధాల్లో 'స్వరం మారింది' : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

భారత్, కెనడా సంబంధాల్లో 'స్వరం మారింది' : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2023
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికాలో విఫల కుట్ర జరిగిన నేపథ్యంలో భారత్, కెనడా సంబంధాల స్వరం మారిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నాడు. కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్‌తో ఆయన బుధవారం మాట్లాడారు. అమెరికా నేరారోపణ మరింత హుందాగా వ్యవహరించాలని భారత ప్రభుత్వాన్ని ఒప్పించినట్లుగా కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా కెనడాపై దాడులకు దిగినంత మాత్రాన ఈ సమస్య సమసిపోదని, ఈ వ్యవహారం కారణంగా తాము భారత్‌తో గొడవకు దిగాలని కోరుకోవడం లేదని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.

Details

తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

కెనడా ప్రజల భద్రత, హక్కులు, న్యాయపాలనకు ఇది పునాదిలాంటి విషయమని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యనించాడు. ఇదిలా ఉండగా.. ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ పన్నూని ఓ భారతీయుడు హత్య్ చేయించేందుకు ప్లాన్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికా అనేకసార్లు ప్రస్తావించింది. ఈ ఆరోపణలపై తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇలాంటి వివాదాల కారణంగా భారత్, అమెరికా మధ్య మైత్రికి ఎలాంటి ఇబ్బంది రాదని, అగ్రరాజ్యంలో భారత్‌కి సుస్థితరమైన బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.