LOADING...
Lithuania: లిథువేనియా కొత్త ప్రధానమంత్రిగా మహిళ

Lithuania: లిథువేనియా కొత్త ప్రధానమంత్రిగా మహిళ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2025
07:52 am

ఈ వార్తాకథనం ఏంటి

లిథువేనియాకు కొత్త ప్రధానమంత్రిగా ఇంగా రుగినియెనె (44) బాధ్యతలు స్వీకరించనున్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఈ నేత ఇప్పుడు ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించనున్నారు. మంగళవారం జరిగిన ఎన్నికలో మాజీ కార్మిక సంఘ నేతగా పేరు పొందిన, ఇటీవలే రాజకీయాల్లో అడుగుపెట్టిన రుగినియెనె పార్లమెంట్ ద్వారా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో ఆమెకు 78 మంది సభ్యులు మద్దతు ఇవ్వగా, ఆమె ప్రత్యర్థి కేవలం 35 ఓట్లకే పరిమితమయ్యారు. గత ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు ఆమె సోషల్ డెమోక్రటిక్ పార్టీలో చేరడం ప్రత్యేకతగా నిలిచింది. మరోవైపు, అవకతవకల ఆరోపణలతో పూర్వ ప్రధానమంత్రి గింటవుటాస్ పలుక్కాస్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లిథువేనియా కొత్త ప్రధానమంత్రిగా ఇంగా రుగినియెనె