Loading...
Iran: ఇరాన్‌లో విషాదం.. ఇంధన ట్యాంకర్‌ పేలి 11 మంది మృతి!
ఇరాన్‌లో విషాదం.. ఇంధన ట్యాంకర్‌ పేలి 11 మంది మృతి!

Iran: ఇరాన్‌లో విషాదం.. ఇంధన ట్యాంకర్‌ పేలి 11 మంది మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2026
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

యుద్ధ పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఇరాన్‌లోని సనందజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఇంధన ట్యాంకర్ ఇతర వాహనాలను ఢీకొట్టిన అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. కుర్దిస్తాన్ ప్రావిన్స్‌లోని సనందజ్-హమదాన్ మధ్య ఉన్న ఇంటర్‌సిటీ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సనందజ్ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు ట్యాంకర్ చేరుకున్న సమయంలో అదుపుతప్పి ఇతర కార్లను ఢీకొట్టినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.

వివరాలు

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

వాహనాలను ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత భారీ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన తర్వాత ట్యాంకర్ నుంచి వ్యాపించిన మంటలు ఇతర వాహనాలకు కూడా అంటుకున్నాయి.

దీంతో ప్రమాద తీవ్రత పెరిగి మృతుల సంఖ్య ఎక్కువైంది. ట్యాంకర్ బ్రేకింగ్ వ్యవస్థలో ఏర్పడిన వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

అయితే ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ ప్రమాదంలో గాయపడిన ఏడుగురిని చికిత్స నిమిత్తం సనందజ్‌లోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితిపై ప్రస్తుతం మరిన్ని వివరాలు వెల్లడికాలేదు.

వివరాలు

2018లోనూ ఇదే ప్రాంతంలో ఘోర ప్రమాదం

సనందజ్ సమీపంలో ఇలాంటి ప్రమాదం గతంలోనూ చోటుచేసుకుంది.

2018లో ఇదే ప్రాంతంలో ఇంధన ట్యాంకర్ కారణంగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు.

తాజాగా మరోసారి ఇంధన ట్యాంకర్ ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT