
Cargo Ship: పసిఫిక్ మహాసముద్రంలో మునిగిన రవాణా నౌక.. 3,000 కార్లు జలసమాధి
ఈ వార్తాకథనం ఏంటి
మెక్సికోకు 3 వేలకుపైగా కార్లు రవాణా చేస్తూ వెళ్లిన ఓ నౌక, కొన్ని వారాల క్రితం అగ్నిప్రమాదానికి గురైందని, ఇప్పుడు ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ రవాణా నౌకలో మొత్తం 3,000 కార్లు ఉండగా, వాటిలో 800 ఎలక్ట్రిక్ వాహనాలున్నాయని సమాచారం. లండన్‌కు చెందిన ఓడ నిర్వహణ సంస్థ 'జోడియాక్ మారిటైమ్' తాజాగా వెల్లడించిన ప్రకారం, అలస్కాలోని అలూటియన్ దీవుల సమీపంలో ఈ నౌక మునిగింది. అయితే మునక కారణంగా పెద్దగా కాలుష్యం వ్యాపించలేదని యూఎస్ కోస్ట్‌గార్డ్ ప్రతినిధి తెలిపారు. కాలుష్యాన్ని నివారించడం కోసం రెండు సాల్వేజ్ టగ్‌లను అక్కడ ఏర్పాటు చేసినట్లు కూడా చెప్పారు.
Details
జూన్ 3న అగ్నిప్రమాదం
జూన్ 3న రవాణా నౌకలో అగ్నిప్రమాదం సంభవించిందని యూఎస్ కోస్ట్‌గార్డ్ ప్రతినిధి తెలిపారు. ఆ సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారంతా లైఫ్ బోట్ ద్వారా బయటపడ్డారు. సమీపంలో ఉన్న 'మర్చంట్ మెరైన్' నౌక వారిని రక్షించింద తెలిపారు. ఓడ వెనుక భాగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నందున మంటల సమయంలో పెద్ద ఎత్తున పొగలు వచ్చాయని కోస్ట్ గార్డ్ అధికారులు, నౌకా సంస్థ వెల్లడించాయని పేర్కొన్నారు.