LOADING...
Epstein Files: ఎప్‌స్టీన్ కేసు మరో మలుపు.. ఎప్స్టీన్ ఫైళ్లలో ట్రంప్ పై అత్యాచారం ఆరోపణలు
ఎప్‌స్టీన్ కేసు మరో మలుపు.. ఎప్స్టీన్ ఫైళ్లలో ట్రంప్ పై అత్యాచారం ఆరోపణలు

Epstein Files: ఎప్‌స్టీన్ కేసు మరో మలుపు.. ఎప్స్టీన్ ఫైళ్లలో ట్రంప్ పై అత్యాచారం ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికాలో క్రిస్మస్ వేళ ఎప్‌స్టీన్ ఫైల్స్ అంశం మరోసారి రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. గత వారం కొంతమేర పత్రాలను బహిర్గతం చేసిన న్యాయశాఖ, తాజాగా మరికొన్ని కీలక డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఈ తాజా ఫైల్స్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు ఉన్నాయని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ కథనాలను న్యాయశాఖ మాత్రం ఖండిస్తూ, అవి నిజం కాదని స్పష్టం చేసింది. న్యాయశాఖ సెన్సార్ చేయని కొత్త ఫైల్‌లో ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్ ఒక మహిళను అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ 2020 నాటి ఎఫ్‌బీఐ ఇన్‌టేక్ ఫారమ్ బహిర్గతం అయింది.

వివరాలు 

1997లో ఓ ఖరీదైన హైఎండ్ హోటల్‌లో ఈ ఘటన

ఆ ఫైల్‌లో ట్రంప్ ఈ ఘటనకు ఎప్‌స్టీన్‌తో కలిసి పాల్పడ్డాడని పేర్కొన్నారు. 1997లో ఓ ఖరీదైన హైఎండ్ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆరోపణల్లో ఉంది. అయితే ఫిర్యాదు చేసిన మహిళ వయసు,ఆమె గుర్తింపు వంటి వివరాలు స్పష్టంగా లభించలేదని, అందువల్ల ఈ అంశంపై సరైన దర్యాప్తు జరగలేదని అధికారులు పేర్కొన్నారు. ఇక మరోవైపు, 1990ల కాలంలో ట్రంప్, ఎప్‌స్టీన్‌తో కలిసి విమాన ప్రయాణాలు చేసినట్టు పలు వివరాలు బయటపడ్డాయి. ముఖ్యంగా 1993 నుంచి 1996 మధ్యలో ఎనిమిది సార్లు కలిసి ప్రయాణించినట్టు విమాన లాగ్‌లు ధృవీకరించినట్లు సమాచారం.

వివరాలు 

 2000 జనవరిలో డ్రైవర్ ఆత్మహత్య 

అలాగే గుర్తు తెలియని ఓ ఫెడరల్ ప్రాసిక్యూటర్ పంపిన ఈ-మెయిల్‌లో,1995లో ట్రంప్‌ను ఓ డ్రైవర్ విమానాశ్రయానికి తీసుకెళ్లిన సందర్భంలో జరిగిన సంఘటనను ప్రస్తావించారు. ఆ సమయంలో ట్రంప్ పదే పదే 'జెఫ్రీ' అనే పేరు పలికాడని, ఒక యువతిని వేధిస్తున్నట్లు ఫోన్ కాల్ ద్వారా డ్రైవర్ విన్నాడని ఆ ఈ-మెయిల్‌లో ఉంది. అనంతరం ఆ డ్రైవర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళను కలిసినట్టు కూడా పేర్కొన్నారు. అయితే ఆ డ్రైవర్ 2000 జనవరిలో ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడైంది. ఈ ఫైల్‌కు సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో పెద్దఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.

Advertisement

వివరాలు 

అబ్బే.. అదేమీ లేదంటున్న ట్రంప్ వర్గం 

తాజాగా మంగళవారం న్యాయశాఖ దాదాపు 30 వేల పత్రాలను విడుదల చేయగా,రాబోయే వారాల్లో లక్షల సంఖ్యలో డాక్యుమెంట్లు బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. అయితే ట్రంప్‌పై వస్తున్న అత్యాచార ఆరోపణలను న్యాయశాఖతో పాటు ట్రంప్ వర్గం కూడా తీవ్రంగా ఖండిస్తోంది. ట్రంప్‌ను ఈ కేసులో ఎప్పుడూ అధికారికంగా విచారించలేదని, అతనిపై ఉన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని న్యాయశాఖ స్పష్టం చేసింది.

Advertisement