
USA: ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందం.. క్రెడిట్ కోసం బైడెన్-ట్రంప్ పోటీ
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలో శాంతి ఒప్పందం కుదిరిన వెంటనే, మరోచోట వివాదం చెలరేగింది.
ఈ ఒప్పందాన్ని సాధించడంలో ఘనత తనదే అని నిరూపించుకునేందుకు ట్రంప్-బైడెన్ మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది.
ఈ వివాదంలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా పాల్గొన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజుల క్రితం హమాస్‌కు హెచ్చరిక చేస్తూ, తన ప్రమాణస్వీకారం నాటికి బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ప్రకటించారు.
మరోవైపు నెతన్యాహును విమర్శించే వీడియోను ట్రంప్ షేర్ చేయడం వల్ల ఇరువర్గాలపై ఒత్తిడి మరింతగా పెరిగింది.
ఇదే సమయంలో జో బైడెన్ కార్యవర్గంలోని ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌కు తరచూ వెళ్లి చర్చలు కొనసాగించారు.
వివరాలు
"అది జోకా?"
ఈ డీల్ కుదిరిన వెంటనే ట్రంప్ సోషల్‌మీడియా ట్రూత్‌లో స్పందిస్తూ,ఇది గొప్ప కాల్పుల విరమణ ఒప్పందమని,నవంబర్‌లో తన విజయం ప్రపంచానికి అమెరికా శాంతిని కోరుకుంటుందని చూపించిందని చెప్పారు.
అంతేకాకుండా,అమెరికన్లు,మిత్ర దేశాల భద్రతను కాపాడేందుకు అవసరమైన ఒప్పందాలపై చర్చిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
దీనికి బైడెన్ తన ప్రసంగంలో స్పందిస్తూ, మే నెలలో ప్రస్తావించిన అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.
ఐరాస భద్రతామండలి సహా ఇతర దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించాయని తెలిపారు.
తన కెరీర్‌లో ఇది అత్యంత కఠినమైన డీల్ అని బైడెన్ పేర్కొన్నారు.
ఈ ఒప్పందం కుదరడంలో ట్రంప్ పాత్ర లేదని స్పష్టంగా చెప్పారు. ఓ విలేకరి ఈ విషయంపై ప్రశ్నించగా, బైడెన్ "అది జోకా?" అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
వివరాలు
ట్రంప్, బైడెన్‌లకు నెతన్యాహు ధన్యవాదాలు
ఇక ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ మాట్లాడుతూ, ఈ డీల్ సాధనలో జోబైడెన్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
అమెరికన్ల భద్రతకు అధ్యక్షుడు బైడెన్ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.
ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు కూడా ట్రంప్, బైడెన్‌లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, బందీల విడుదలలో కీలక పాత్ర పోషించినందుకు ట్రంప్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అంతేకాకుండా, జోబైడెన్‌తో కూడా తాను మాట్లాడినట్లు వెల్లడించారు.