Loading...
Trump: ట్రంప్‌తో ఫొటో దిగే ఛాన్స్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ట్రంప్‌తో ఫొటో దిగే ఛాన్స్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Trump: ట్రంప్‌తో ఫొటో దిగే ఛాన్స్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఫొటో దిగడం అంత సులభమైన విషయం కాదు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండే ట్రంప్‌ను దగ్గరగా కలవడం,ఆయనతో ఫొటో దిగడం సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. అయితే రిపబ్లికన్ నేషనల్ కమిటీ (RNC) ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఇందుకోసం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ఆగస్టు 27న హ్యూస్టన్‌లో ట్రంప్ కోసం RNC ప్రత్యేక నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ట్రంప్‌తో ఫొటో దిగేందుకు ప్రత్యేకంగా ధరను నిర్ణయించినట్లు ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు. ట్రంప్‌తో గ్రూప్ ఫొటో దిగాలంటే 88,600 డాలర్లు చెల్లించాలి. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.85 లక్షలకు సమానం.

వివరాలు 

జంటకు రూ.9.5 లక్షలు

ఈ ఆహ్వాన పత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దీనిపై అమెరికాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

కార్యక్రమంలో పాల్గొనే టికెట్ల ధరలు జంటకు 10,000 డాలర్ల నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఒక జంటకు భారత కరెన్సీలో సుమారు రూ.9.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ట్రంప్‌తో గ్రూప్ ఫొటోకు మాత్రం ఏకంగా 88,600 డాలర్ల ధర నిర్ణయించారు. దీంతో ట్రంప్‌తో ఒక ఫొటో కోసం ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించాలా అంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

హోస్ట్ కమిటీ ప్యాకేజీని 4,43,000 డాలర్లు

ఇక ఈ కార్యక్రమంలో అత్యంత ఖరీదైన హోస్ట్ కమిటీ ప్యాకేజీని 4,43,000 డాలర్లుగా నిర్ణయించారు.

భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.4.2 కోట్లు. దీంతో ట్రంప్‌తో ఫొటో దిగేందుకు నిర్ణయించిన భారీ ధరపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.

ఒకే ఒక్క ఫొటో కోసం రూ.85 లక్షలు ఖర్చు చేయడం అవసరమా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరికొందరు మాత్రం ట్రంప్‌తో ఫొటో దిగే అరుదైన అవకాశంగా దీనిని చూస్తున్నారు.

ADVERTISEMENT