Loading...
Trump-Putin: పుతిన్‌తో ట్రంప్ భారీ చమురు ఒప్పందాలు.. అమెరికా కీలక ప్రతిపాదనలు
పుతిన్‌తో ట్రంప్ భారీ చమురు ఒప్పందాలు.. అమెరికా కీలక ప్రతిపాదనలు

Trump-Putin: పుతిన్‌తో ట్రంప్ భారీ చమురు ఒప్పందాలు.. అమెరికా కీలక ప్రతిపాదనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వ్యూహాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను శాంతి ఒప్పందానికి ఒప్పించేందుకు భారీ వ్యాపార ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా చమురు, సహజ వాయువు వంటి ఇంధన రంగాలతో పాటు ఇతర కీలక పరిశ్రమల్లోనూ రష్యాతో కలిసి పనిచేయాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధం ముగిస్తే రష్యాలో అమెరికా కంపెనీలు మళ్లీ తమ కార్యకలాపాలను ప్రారంభించడం, ఐరోపా దేశాలకు రష్యా చమురు సరఫరాలను పునరుద్ధరించడం వంటి అంశాలు ఈ ప్రతిపాదనల్లో ఉన్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

వివరాలు 

రష్యాలో అమెరికా కంపెనీలకు మళ్లీ అవకాశం?

ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్‌ను ఒప్పించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా ఈ వ్యాపార అవకాశాలను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది.

రష్యా తూర్పు ప్రాంతంలోని సఖాలిన్‌ తీరంలో కొనసాగుతున్న ఉమ్మడి చమురు ప్రాజెక్టులో అమెరికా కంపెనీలు తిరిగి భాగస్వాములు కావడం ఈ ప్రతిపాదనల్లో ప్రధానమైనదిగా సమాచారం.

యుద్ధం ముగిసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇది ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

ఐరోపాకు మళ్లీ రష్యా చమురు సరఫరా?

రష్యా నుంచి ఐరోపా దేశాలకు చమురు సరఫరాలను తిరిగి ప్రారంభించే అంశంపైనా చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.

ముఖ్యంగా డ్రుజ్బా (Druzhba) పైప్‌లైన్ ద్వారా రష్యా చమురును మళ్లీ ఐరోపా దేశాలకు సరఫరా చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

దీనితో పాటు సహజ వాయువు సరఫరా, టైటానియం ఉత్పత్తి, విమానయాన రంగాల్లోనూ అమెరికా-రష్యా మధ్య పరస్పర సహకారాన్ని పెంచే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందాలు అమలైతే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

అబుదాబిలో శాంతి చర్చలు?

మరోవైపు, వచ్చే నెలలో అబుదాబిలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు జరిగే అవకాశమున్నట్లు సమాచారం.

ఈ చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలికేందుకు పుతిన్‌ను ఒప్పించాలని అమెరికా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

చమురు, ఇంధన రంగాల్లో వ్యాపార అవకాశాలను చూపించడం ద్వారా శాంతి ఒప్పందానికి మార్గం సుగమం చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

అబుదాబిలో శాంతి చర్చలు?

అయితే ఈ ప్రతిపాదనలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అమెరికా అందిస్తున్న వ్యాపార అవకాశాలకు రష్యా అంగీకరించి యుద్ధాన్ని ముగించేందుకు ముందుకు వస్తుందా? ఇరు దేశాల మధ్య ఆర్థిక ఒప్పందాలు శాంతి చర్చలకు ఎంతవరకు దోహదపడతాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చమురు, ఇంధన ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగియడానికి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

ADVERTISEMENT