Trump-Situation Room: ఇరాన్‌పై ఒత్తిడి పెంచే దిశగా ట్రంప్ అడుగులు.. సిచువేషన్ రూమ్‌లో అత్యవసర సమావేశం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో ఏర్పడిన ఆందోళనకర పరిస్థితులు, ఇరాన్‌తో పెరుగుతున్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోని సిచువేషన్ రూమ్‌లో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌తో పాటు జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అధికారులు హాజరయ్యారు. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడడం,అలాగే అణు కార్యక్రమానికి సంబంధించిన అమెరికా డిమాండ్లను ఇరాన్ అంగీకరించేలా ఒత్తిడి పెంచే చర్యలపై ట్రంప్ సానుకూలంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వివరాలు
వైట్‌హౌస్‌లోని సిచువేషన్ రూమ్ ప్రత్యేకత ఇదే
ఈ పరిణామాల నేపథ్యంలోనే సిచువేషన్ రూమ్‌లో అత్యవసరంగా సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
గత ఏడాది జూన్‌లో ఇరాన్‌పై జరిగిన దాడుల సమయంలోనూ, అంతకుముందు అమెరికా చేపట్టిన పలు కీలక సైనిక ఆపరేషన్లను కూడా అధ్యక్షులు ఇదే గది నుంచి పర్యవేక్షించిన విషయం తెలిసిందే.
వైట్‌హౌస్ వెస్ట్ వింగ్ బేస్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన సిచువేషన్ రూమ్ సుమారు 5,525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.
ఇందులో అత్యాధునిక కాన్ఫరెన్స్ రూమ్‌తో పాటు ఇంటెలిజెన్స్ మేనేజ్‌మెంట్ సెంటర్ కూడా అందుబాటులో ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడు, ఆయన భద్రతా సలహాదారులు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో తలెత్తే అత్యవసర పరిస్థితులు, భద్రతా సంక్షోభాలు, సైనిక పరిణామాలను సమీక్షించేందుకు ఈ కేంద్రాన్ని వినియోగిస్తుంటారు.
వివరాలు
మళ్లీ చాబహార్ వాచ్ టవర్‌పై అమెరికా దాడి
తాజా దాడుల్లో అమెరికా మరోసారి ఇరాన్‌లోని చాబహార్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది. అక్కడ ఉన్న నౌకాదళ వాచ్ టవర్‌పై క్షిపణులతో దాడి జరిపినట్లు సమాచారం.
ఇదే టవర్‌పై గతంలో కూడా ఒకసారి దాడి చేసి ధ్వంసం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
సముద్ర భద్రతను పర్యవేక్షించడం, మత్స్యకారులకు అవసరమైన సహాయక చర్యలను సమన్వయం చేయడం వంటి కీలక కార్యకలాపాల కోసం ఈ వాచ్ టవర్‌ను వినియోగిస్తున్నారు.