LOADING...
Trump: 'ఒంటరిని అయిపోయాను'..విదేశీ పర్యటనలకు ముందు వాన్స్‌కు ట్రంప్‌ రహస్య లేఖ..!
'ఒంటరిని అయిపోయాను'..విదేశీ పర్యటనలకు ముందు వాన్స్‌కు ట్రంప్‌ రహస్య లేఖ..!

Trump: 'ఒంటరిని అయిపోయాను'..విదేశీ పర్యటనలకు ముందు వాన్స్‌కు ట్రంప్‌ రహస్య లేఖ..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ పర్యటనలకు వెళ్లే ప్రతిసారీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కోసం ప్రత్యేకంగా ఓ రహస్య లేఖ రాసి ఉంచుతారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈవిషయాన్ని వైట్‌హౌస్‌కు చెందిన అధికారి సెబాస్టియన్‌ గోర్క్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ట్రంప్‌ చైనా పర్యటనలో ఉన్న వేళ ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గోర్క్‌ తెలిపిన వివరాల ప్రకారం..ట్రంప్‌ విదేశీ పర్యటనలకు బయలుదేరే ముందు అధ్యక్ష కార్యాలయంలోని ప్రత్యేక డెస్క్‌లో వాన్స్‌ కోసం ఒక రహస్య లేఖను ఉంచుతారట. ఆపర్యటనలో తనకు ఏదైనా అనూహ్య పరిస్థితి ఎదురైతే దేశ పరిపాలన ఎలా ముందుకు సాగాలనే అంశాలపై అందులో కీలక సూచనలు ఉంటాయని ఆయన చెప్పారు.

వివరాలు 

ట్రంప్‌పై గతంలో పలు హత్యాయత్నాలు

ప్రస్తుతం ట్రంప్‌ చైనా పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీ శక్తులు ఆయనను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటి భయాలకు తావులేదని గోర్క్‌ స్పష్టం చేశారు. ట్రంప్‌కు కట్టుదిట్టమైన భద్రత ఉందని, ఆయన పూర్తిగా సురక్షితంగానే ఉన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ట్రంప్‌పై గతంలో పలు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. 2024లో పెన్సిల్వేనియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువకుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఆ ఘటనలో తూటా ట్రంప్‌ కుడి చెవి పైభాగాన్ని తాకుతూ వెళ్లింది. అనంతరం ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతున్న సమయంలో మరో వ్యక్తి తుపాకీతో భద్రతా వలయం వద్దకు చేరుకున్నాడు.

వివరాలు 

కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో కాల్పుల ఘటన

అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల వాషింగ్టన్‌లోని హిల్టన్‌ హోటల్‌లో నిర్వహించిన వైట్‌హౌస్‌ కరస్పాండెంట్స్‌ డిన్నర్‌లో కూడా కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు సహా పలువురు కీలక నేతలు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Advertisement

వివరాలు 

ఒంటరిని అయిపోయాను: వాన్స్

ట్రంప్‌తో పాటు పలువురు కీలక అధికారులు ప్రస్తుతం చైనా పర్యటనలో ఉండటంతో వైట్‌హౌస్‌ బాధ్యతలు ఉపాధ్యక్షుడు వాన్స్‌ చూసుకుంటున్నారు. భద్రతా నిబంధనల ప్రకారం అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరూ కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లరు. ఈ విషయాన్ని ప్రస్తావించిన వాన్స్‌.. "ఇప్పుడు నేను వైట్‌హౌస్‌కు వెళ్లాలి. అక్కడ ఎవరూ ఉండరు. చుట్టూ నిశ్శబ్దం కనిపిస్తుంది. అసలు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది" అని విలేకరులతో అన్నారు. ఆయన వ్యాఖ్యలకు అక్కడున్నవారు నవ్వులు పూయించారు. అదే సమయంలో తన పరిస్థితిని 1990లో విడుదలైన Home Alone చిత్రంలోని Macaulay Culkin పాత్రతో పోల్చుతూ వాన్స్‌ సరదాగా వ్యాఖ్యానించారు.

Advertisement