Epstein's house: 'ఆ బాలికల గురించి ట్రంప్‌నకు తెలుసు'.. ఈమెయిల్ సాక్ష్యాన్ని బయటపెట్టిన డెమోక్రాట్లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, మైనర్లతోపాటు పలువురు మహిళలను అక్రమ లైంగిక సంబంధాలకు వాడుకున్న నేరంతో జైలు శిక్ష అనుభవించి అక్కడే మరణించిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలపై మరిన్ని ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. డెమోక్రాట్లు తాజాగా బహిర్గతం చేసిన ఈమెయిల్‌లో, ట్రంప్‌కి ఆ బాలికల గురించి ముందే తెలిసినట్లు, ఇంకా ఎప్‌స్టీన్ ఇంటివద్ద బాధితురాలైన ఒక బాలికతో ఆయన కొన్ని గంటలు గడిపినట్లు వివరాలు ఉన్నాయి. ఈమెయిల్ హౌస్ కమిటీకి ఎప్‌స్టీన్ సిబ్బంది సమర్పించిన 23 వేల పత్రాలలో భాగమని సమాచారం.
వివరాలు
ప్రస్తుతం జైలులో ఉన్న గ్లీస్లెయిన్ మ్యాక్స్‌వెల్
2011 ఏప్రిల్ 2న ఎప్‌స్టీన్ తన స్నేహితురాలు గ్లీస్లెయిన్ మ్యాక్స్‌వెల్‌కు రాసిన ఈమెయిల్‌లో, "మొరగని ఆ కుక్క ట్రంప్ అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నా.? (పేరు చెప్పని బాలిక) అతడితో మా ఇంట్లో కొన్ని గంటలు గడిపింది. కానీ అతని పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు" అని పేర్కొన్నాడు. దీనికి మ్యాక్స్‌వెల్ "నేనూ అలాగే అనుకుంటున్నా" అంటూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం గ్లీస్లెయిన్ మ్యాక్స్‌వెల్ కూడా జైలులో శిక్ష అనుభవిస్తోంది.