LOADING...
Gold Card: 1 మిలియన్‌ డాలర్లు చెలిస్తే అమెరికా నివాసం మీ సొంతం!
1 మిలియన్‌ డాలర్లు చెలిస్తే అమెరికా నివాసం మీ సొంతం!

Gold Card: 1 మిలియన్‌ డాలర్లు చెలిస్తే అమెరికా నివాసం మీ సొంతం!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2025
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా పౌరసత్వం పొందాలనుకునే ధనవంతుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన 'గోల్డ్‌ కార్డు' పథకం ఇప్పుడు అధికారికంగా విక్రయానికి వచ్చింది. తాజాగా ట్రంప్‌ స్వయంగా ఈకార్డుల అమ్మకానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 1 మిలియన్‌ డాలర్లు చెల్లించే వ్యక్తులకు అమెరికాలో నివాసం కల్పించే అవకాశం ఈపథకం ద్వారా లభించనుంది. వైట్‌హౌస్‌లో ప్రముఖ వ్యాపారవేత్తలతో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ట్రంప్‌ ఈ కార్డు అమ్మకాల ప్రారంభాన్ని ప్రకటించారు. గోల్డ్‌ కార్డు కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విదేశీపెట్టుబడులను ఆకర్షించేందుకు 1990లో ప్రవేశపెట్టిన EB-5ప్రోగ్రామ్‌లో జరుగుతున్న దందాలు, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆవిధానానికి బదులుగా ఈ కొత్త గోల్డ్‌ కార్డు పథకాన్ని తీసుకువస్తున్నట్లు ట్రంప్‌ చెప్పారు.

వివరాలు 

ప్రతిభావంతులైన ఉద్యోగులను అమెరికాలోనే కొనసాగించేందుకు 2 మిలియన్‌ డాలర్లు

సంవత్సరాలు సమయం తీసుకొనే నియామక ప్రక్రియ నుంచి ఉపశమనం కల్పిస్తోందన్నారు. ఈ పథకం ప్రారంభించడం పట్ల తనకు ఎంతో ఉత్సాహంగా ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ కార్డు ప్రవేశపెట్టామన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ కొన్ని నిమిషాల్లోనే దరఖాస్తులను స్వీకరించే స్థితిలోకి వస్తుందని చెప్పారు. వ్యక్తిగత దరఖాస్తుదారులు 1 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని, కంపెనీలు తమ ప్రతిభావంతులైన ఉద్యోగులను అమెరికాలోనే కొనసాగించేందుకు 2 మిలియన్‌ డాలర్లు చెల్లించే అవకాశముందని వివరించారు. "మన దేశంలోకి ప్రతిభావంతులు రావడం చాలా మంచిది. భారత్‌, చైనా, యూరప్‌ వంటి దేశాలకు తిరిగి వెళ్లిపోతున్న నైపుణ్యాలు ఇప్పుడు అమెరికాలోనే నిలిచిపోతాయి" అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు 

గోల్డ్‌ కార్డుతో పాటు గ్రీన్‌ కార్డు కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులు

వీసా వ్యవస్థలో మార్పులు చేయాలని వ్యాపారవర్గాలు పలుమార్లు ఒత్తిడి చేశాయని ట్రంప్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, వీసాల అనిశ్చితి కారణంగా కంపెనీలు ప్రతిభావంతులను కోల్పోతున్నాయని కుక్‌ తనతో చెప్పారని వివరించారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా అమెరికా ఖజానాకు బిలియన్‌ డాలర్ల మేర ఆదాయం వచ్చే అవకాశముందని ట్రంప్‌ అంచనా వేశారు. ఇదిలా ఉండగా, గోల్డ్‌ కార్డుతో పాటు గ్రీన్‌ కార్డు కోసం కూడా వైట్‌హౌస్‌ బుధవారం మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది.

Advertisement