Trump: ఒబామా, బైడెన్‌తో కలిసి మ్యాచ్ చూడాలని ట్రంప్ కోరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మాజీ అధ్యక్షులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి వైట్‌హౌస్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలనే తన కోరికను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. బరాక్ ఒబామా, జో బైడెన్‌తో పాటు ఇతర మాజీ అధ్యక్షులందరితో కలిసి వైట్‌హౌస్‌లో ఫుట్ బాల్ మ్యాచ్ వీక్షించే అవకాశం లభిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ నిర్వహించిన ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.
వివరాలు
'స్టోరీ టైమ్ విత్ సెకెండ్ లేడీ' పేరుతో పాడ్‌కాస్ట్..
అమెరికా స్వాతంత్య్రానికి 250 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా 'స్టోరీ టైమ్ విత్ సెకెండ్ లేడీ' పేరుతో ఈ పాడ్‌కాస్ట్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రచురించిన 'ప్రెసిడెంట్స్ ప్లే' పుస్తకంలోని కొన్ని భాగాలను ట్రంప్ స్వయంగా చదివి వినిపించారు. సాధారణంగా బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో బరాక్ ఒబామా, జో బైడెన్‌లపై విమర్శలు చేయడంలో వెనుకాడని ట్రంప్, వారిని వైట్‌హౌస్‌కు ఆహ్వానించి కలిసి సూపర్ బౌల్ ఫుట్‌బాల్ మ్యాచ్ వీక్షించాలనే ఆలోచనకు ఉషా వాన్స్ ప్రేరణగా నిలిచారని తెలిపారు.
వివరాలు
అధ్యక్షుల రీయూనియన్..
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, "బరాక్ ఒబామా, జో బైడెన్‌లతో పాటు బుష్ కుటుంబానికి చెందిన మాజీ అధ్యక్షులను కూడా ఆహ్వానించాలని అనుకుంటున్నాను. వారిలో కొందరైనా వస్తే కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తాం. అలాంటి కార్యక్రమం ఒక మంచి కథనంగా నిలుస్తుంది. అధ్యక్షుల రీయూనియన్ అంటే ప్రజలకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా మీడియా దానిపై విస్తృతంగా స్పందిస్తుంది" అని వ్యాఖ్యానించారు.