Iran-Usa: రెండు వారాల టైమ్ ఇచ్చిన ట్రంప్.. హర్మూజ్‌పై కీలక షరతు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కీలక గడువు పొడిగింపు ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలనే షరతుతో మరో రెండు వారాల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్'తో పాటు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తో చర్చలు జరిపినట్టు వెల్లడించారు. పాక్ నాయకత్వం చేసిన విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించడమే కాకుండా, ఇరాన్‌పై చేపట్టాల్సిన సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదిక Truth Social ద్వారా ప్రజలకు తెలియజేశారు.
వివరాలు
కీలక దశకు రెండు దేశాల మధ్య చర్చలు
ట్రంప్ వివరించిన ప్రకారం, ఇరాన్ కూడా చర్చలకు ముందుకొచ్చి పది అంశాలతో కూడిన ప్రతిపాదనను పంపింది. ఆ ప్రతిపాదనలు సానుకూలంగా ఉన్నాయని, దీంతో రెండు దేశాల మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. ఇరుదేశాలు పరస్పరం కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఈ రెండు వారాల గడువు శాశ్వత శాంతి ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ ఆసియాలో స్థిరమైన శాంతిని నెలకొల్పేందుకు ఇది మంచి అవకాశమని చెప్పారు. ఈ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దిశగా ముందడుగు పడుతున్నందుకు సంతోషంగా ఉందని, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు పెరిగాయని ట్రంప్ తెలిపారు.