Loading...
Trump: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి త్వరలో ముగింపు.. కీలక ప్రకటన చేసిన ట్రంప్
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి త్వరలో ముగింపు.. కీలక ప్రకటన చేసిన ట్రంప్

Trump: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి త్వరలో ముగింపు.. కీలక ప్రకటన చేసిన ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి త్వరలోనే ముగింపు పలికే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం దౌత్యపరమైన చర్చలు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య గొప్ప ఒప్పందం కుదరవచ్చని తెలిపారు. ఈ ఒప్పందం కేవలం రష్యా, ఉక్రెయిన్‌ మధ్య సమస్యల పరిష్కారానికే పరిమితం కాదని, యూరప్‌ భద్రతతో పాటు భవిష్యత్తు రాజకీయ పరిణామాలపైనా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

వివరాలు 

యుద్ధం కారణంగా ప్రాణనష్టం

శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రత్యేక రాయబారి కిరిల్‌ ద్మిత్రీవ్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమైనట్లు ట్రంప్‌ ధ్రువీకరించారు.

ఈ భేటీలో చర్చించిన అంశాలను ప్రస్తుతం బయటపెట్టలేనని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఒప్పందం కుదిరితే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతోషిస్తారని అభిప్రాయపడ్డారు.

మరోవైపు, యుద్ధం కారణంగా జరుగుతున్న ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఇరు పక్షాల్లోనూ ప్రతి నెలా సుమారు 25 వేల మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.

ఈ అనవసర మరణాలను వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉందని ట్రంప్‌ అన్నారు.

వివరాలు 

హెగ్సెత్‌కు ట్రంప్‌ మద్దతు

అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్‌లో నిరసనలు, అభిశంసన డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఆయనకు బహిరంగంగా మద్దతు ప్రకటించారు.

హెగ్సెత్‌ నాయకత్వంలో ఇరాన్‌, వెనిజులాలో అమెరికా చేపట్టిన సైనిక చర్యలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు.

ఆయనను పదవి నుంచి తొలగించే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు.

పెంటగాన్‌లోని కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి ఉన్నప్పటికీ, హెగ్సెత్‌ మాత్రం తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.

ADVERTISEMENT

వివరాలు 

'వోక్‌' భావజాలాన్ని కలిగి ఉండటంతో హెగ్సెత్‌కు కొంత వ్యతిరేకత

పీట్‌ హెగ్సెత్‌ అద్భుతంగా పనిచేస్తున్నారని ట్రంప్‌ పేర్కొన్నారు.

రెండో ప్రపంచ యుద్ధం కాలంతో పోలిస్తే ప్రస్తుతం అమెరికా వద్ద అత్యధిక సంఖ్యలో ఫోర్‌స్టార్‌ జనరల్స్‌ ఉన్నారని తెలిపారు.

వారిలో చాలామంది 'వోక్‌' భావజాలాన్ని కలిగి ఉండటంతో హెగ్సెత్‌కు కొంత వ్యతిరేకత ఎదురవుతోందని వ్యాఖ్యానించారు.

అలాంటి భావజాలం ఉన్న జనరల్స్‌ తనకు నచ్చరని అన్నారు. అయినప్పటికీ విమర్శలను ఎదుర్కొంటూ హెగ్సెత్‌ తన విధులను సమర్థంగా నిర్వహిస్తున్నారని ట్రంప్‌ కొనియాడారు.

ADVERTISEMENT

వివరాలు 

48 నిమిషాల్లోనే వెనిజులా ఆపరేషన్‌ పూర్తి

వెనిజులాలో అమెరికా చేపట్టిన సైనిక చర్య కేవలం 48 నిమిషాల్లోనే పూర్తయిందని ట్రంప్‌ వెల్లడించారు.

ఈ ఆపరేషన్‌లో ఒక్క అమెరికా సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోలేదని చెప్పారు.

సైనిక చరిత్రలోనే అత్యంత విజయవంతమైన దాడుల్లో ఇదొకటని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యల వల్ల పెద్దగా ప్రాణనష్టం లేకుండానే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించామని సమర్థించుకున్నారు.

ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యలు కూడా విజయవంతమయ్యాయని ట్రంప్‌ తెలిపారు.

ఆ దేశంపై విధించిన ఆంక్షలు, సముద్ర దిగ్బంధం మంచి ఫలితాలను ఇచ్చాయని చెప్పారు.

కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాలపై అమెరికా దళాలు పూర్తి నియంత్రణ సాధించాయని వెల్లడించారు.

అమెరికా చర్యలతో ఇరాన్‌ తీవ్రంగా దెబ్బతిందని,తిరిగి కోలుకోవడానికి కనీసం 25 నుంచి 30ఏళ్ల సమయం పట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

48 నిమిషాల్లోనే వెనిజులా ఆపరేషన్‌ పూర్తి

ఇరాన్‌ మళ్లీ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోకుండా ఉండేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ట్రంప్‌ చెప్పారు.

అవసరమైతే దాడులను మరింత పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తామని వెల్లడించారు.

ADVERTISEMENT