LOADING...
Trump: హర్మూజ్ సంక్షోభం: మిత్ర దేశాలపై ట్రంప్ అసహనం
హర్మూజ్ సంక్షోభం: మిత్ర దేశాలపై ట్రంప్ అసహనం

Trump: హర్మూజ్ సంక్షోభం: మిత్ర దేశాలపై ట్రంప్ అసహనం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2026
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, హర్మూజ్ జలసంధిని బలప్రయోగంతో తెరవాలని అమెరికా చేసిన యత్నాలు ఫలించలేదు. ఈ పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ విషయంలో తమకు ఇతర దేశాల సహాయం అవసరం లేదని స్పష్టం చేశారు. హర్మూజ్‌లో నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు అమెరికా స్వయంగా చర్యలు చేపడుతుందని తెలిపారు. ''మాకు ఎవరూ అవసరం లేదు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం మాదే. మా సైన్యం కూడా అత్యంత బలంగా ఉంది'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధి విషయంలో మిత్ర దేశాలు ముందుకు రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

వివరాలు 

అవసరమైతే తన చైనా పర్యటనను కూడా వాయిదా వేసుకుంటా: ట్రంప్ 

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో చమురు సరఫరాపై ఆందోళనలు మరింత పెరిగాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చమురు నౌకల రవాణాపై ఇరాన్ ప్రభావం పెరగడంతో ఇంధన భయాలు చెలరేగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడికి యుద్ధ నౌకలను పంపాలని ట్రంప్ ఇచ్చిన పిలుపును మిత్ర దేశాలు మాత్రమే కాకుండా చైనా కూడా తిరస్కరించింది. నాటో కూటమి కూడా ఈ విషయంలో ముందుకు రాలేదు. దేశాలు సహకరించినా, చేయకపోయినా వాటి వైఖరిని గమనిస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, అవసరమైతే తన చైనా పర్యటనను కూడా వాయిదా వేసుకుంటానని పేర్కొన్నారు.

Advertisement