Loading...
Trump: ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు తాత్కాలిక విరామం.. ట్రంప్ కీలక ప్రకటన
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు తాత్కాలిక విరామం.. ట్రంప్ కీలక ప్రకటన

Trump: ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యకు తాత్కాలిక విరామం.. ట్రంప్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 26, 2026
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తక్షణ సైనిక దాడులు చేసే అవకాశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఇప్పటికిప్పుడు ఇరాన్‌పై ఎలాంటి దాడులు చేయబోమని స్పష్టం చేశారు. ఈ వివాదాన్ని ఒప్పందం ద్వారా పరిష్కరించాలా? లేక ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టి లక్ష్యాన్ని పూర్తి చేయాలా? అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ తాజా ప్రకటనతో తక్షణ దాడుల ముప్పు తాత్కాలికంగా తగ్గినప్పటికీ, భవిష్యత్తులో ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే అవకాశం పూర్తిగా తొలగిపోలేదు. అదే సమయంలో ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

వివరాలు 

ప్రత్యక్ష చర్చలు నిలిచిపోయినా.. మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు నిలిచిపోయినప్పటికీ, మధ్యవర్తుల ద్వారా దౌత్యపరమైన సమాచార మార్పిడి కొనసాగుతోందని ఇరాన్ వెల్లడించింది.

అయితే, వాషింగ్టన్ విధిస్తున్న షరతులను అంగీకరించేందుకు నిరాకరించింది.

మరోవైపు, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్, పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఆయా దేశాల ప్రతినిధులు ఇరాన్‌లో పర్యటించడంతో పాటు, వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు.

వివరాలు 

హర్ముజ్ జలసంధి విషయంలో కొనసాగుతున్న వివాదం

ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత ఇరాన్, అమెరికా మధ్య ప్రధాన వివాదాంశంగా మారింది.

అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగిస్తే, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ రాయబారి వెల్లడించారు.

అయితే, ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్‌కు అనుబంధంగా ఉన్న మీడియా సంస్థలు ఈ వార్తలను ఖండించాయి.

జలసంధిని తెరిచేందుకు సంబంధించి ఇరాన్ తరఫున ఎలాంటి కొత్త ప్రతిపాదన చేయలేదని స్పష్టం చేశాయి.

దీంతో ఈ అంశంపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందా లేదా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

ADVERTISEMENT