Page Loader
Donald Trump: ట్రంప్ పాలనకు వంద రోజులు పూర్తి.. ఈ షాకింగ్ స్టేట్‌మెంట్లు వైరల్!
ట్రంప్ పాలనకు వంద రోజులు పూర్తి.. ఈ షాకింగ్ స్టేట్‌మెంట్లు వైరల్!

Donald Trump: ట్రంప్ పాలనకు వంద రోజులు పూర్తి.. ఈ షాకింగ్ స్టేట్‌మెంట్లు వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2025
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ పాలన వంద రోజుల మైలురాయి దిశగా వేగంగా సాగుతోంది. పదవిలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్న ట్రంప్, తనదైన విధంగా ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతున్నారు. వాణిజ్య యుద్ధాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచాన్ని ఒకింత ఉలిక్కిపడేలా చేస్తున్నారు. ఈ మూడు నెలల వ్యవధిలో ట్రంప్‌ చేసిన కీలక వ్యాఖ్యలు, చర్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 1. 'నన్ను దేవుడే రక్షించాడు' పెన్సిల్వేనియాలో తనపై జరిగిన హత్యాయత్నం నుంచి ఎలా తప్పించుకున్నానో పదవిలోకి వచ్చిన మొదటి రోజే ట్రంప్‌ వివరించారు. 'అమెరికా మళ్లీ మహత్తుగా మారాలంటే నేను అవసరం. అందుకే దేవుడే నన్ను కాపాడాడు' అని వ్యాఖ్యానించారు.

Details

 2. కెనడా గురించి సంచలన వ్యాఖ్య.. అమెరికా 51వ రాష్ట్రమా? 

ఫిబ్రవరిలో చేసిన ఓ వ్యాఖ్యలో ట్రంప్‌ కెనడా గురించి మాట్లాడుతూ, అది త్వరలో అమెరికా 51వ రాష్ట్రంగా మారొచ్చని చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలు కెనడాలో కలకలం రేపాయి. 3. జెలెన్‌స్కీపై విమర్శ - 'ఎన్నికలు లేని నియంత' ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఆయన ఒక ఎన్నికల లేని నియంత' అని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలతో ఉక్రెయిన్‌తో ఉన్న స్నేహపూర్వక సంబంధాలపై కొత్త ప్రశ్నలు లేవినట్టు అయింది. 4. వాణిజ్య యుద్ధంపై ఎగతాళి కస్టమ్స్ సుంకాలపై పలుదేశాలు చర్చించేందుకు మొగ్గుచూపుతున్నాయని చెప్పారు. 90 రోజుల విరామాన్ని ప్రకటిస్తూ.. 'వాటిని తగ్గించేందుకు దేశాలన్నీ నా వెంటపడుతున్నాయంటూ ట్రంప్ చెప్పారు. ఈవ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు తెరతీశాయి.

Details

 5. ఈయూపై తీవ్రమైన ఆరోపణ 

యూరోపియన్ యూనియన్‌పై ఫిబ్రవరిలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. 'ఈయూ అమెరికా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడానికి ఏర్పడింది. ఇప్పటి వరకూ అది విజయవంతమైంది. కానీ ఇప్పుడు నేను అధ్యక్షుడిని' అంటూ అన్నారు. దానిపై త్వరలో టారిఫ్‌లు (సుంకాలు) విధిస్తానని కూడా ప్రకటించారు. 6. న్యాయమూర్తిపై ఘాటుగా - అభిశంసన వ్యాఖ్యలు ఒక కేసులో హాజరుకావాల్సిన పరిస్థితిని తలపెట్టి, ట్రంప్‌ న్యాయమూర్తి జేమ్స్ బోయాస్‌బర్గ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'ఇలాంటి న్యాయమూర్తులను అభిశంసించాలి' అంటూ ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ స్వయంగా స్పందించి ట్రంప్‌ను హెచ్చరించాల్సి వచ్చింది.