LOADING...
US-India: సుంకాల ఉద్రిక్తతల నడుమ ట్రంప్ నిర్ణయం.. సన్నిహితుడు సెర్గియో గోర్‌కి కీలక బాధ్యతలు
సుంకాల ఉద్రిక్తతల నడుమ ట్రంప్ నిర్ణయం.. సన్నిహితుడు సెర్గియో గోర్‌కి కీలక బాధ్యతలు

US-India: సుంకాల ఉద్రిక్తతల నడుమ ట్రంప్ నిర్ణయం.. సన్నిహితుడు సెర్గియో గోర్‌కి కీలక బాధ్యతలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-అమెరికా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశానికి కొత్త రాయబారిగా తన సన్నిహితుడు, రాజకీయ సహాయకుడు సెర్గియో గోర్ (38)ను నియమించారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రకటించారు. విదేశాంగ విధానంపై అనుభవం ఉన్న గోర్, రాయబారిగా అద్భుతంగా పని చేస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాక, గోర్ దక్షిణ-మధ్య ఆసియాకు ప్రత్యేక రాయబారి పాత్రను కూడా నిర్వహించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు.

Details

వైట్‌హౌస్‌లో అత్యంత నమ్మకస్థుడిగా గుర్తింపు

ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య సుంకాల సమస్యలతో సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించడం వల్ల ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి సున్నితమైన పరిస్థితుల్లో గోర్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన రాకతో ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడతాయా? లేక మరింతగా ఉద్రిక్తతలు పెరుగుతాయా అన్నది చూడాల్సి ఉంది. సెర్గియో గోర్, ట్రంప్‌కు అత్యంత విధేయుడిగా పేరొందిన వ్యక్తి. వైట్‌హౌస్‌లో ఆయనకు అత్యంత నమ్మకస్థుడిగా వ్యవహరించారు. అయితే, గోర్‌కు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో మంచి సంబంధాలు లేవు.

Details

భారత్, అమెరికా సంబంధాలు ముఖ్యమైనవి

మస్క్‌ను పాము లాంటి వ్యక్తి అంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ట్రంప్, ముఖ్యమైన దౌత్యవేత్తల నియామకంలో సన్నిహితులను ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ప్రసిద్ధి. ఆ విధానంలో భాగంగానే గోర్ భారత రాయబారిగా ఎంపికయ్యారు. ఇక అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, గోర్ నియామకాన్ని ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో సమర్థించారు. భారత్-అమెరికా సంబంధాలు అత్యంత ముఖ్యమైనవని, అలాంటి సంబంధానికి గోర్ అద్భుత ప్రతినిధిగా ఉంటారని రూబియో వ్యాఖ్యానించారు.