LOADING...
Donald Trump: 80వ పుట్టిన రోజుకు ట్రంప్ స్పెషల్ ప్లాన్.. వైట్‌హౌస్‌లో కేజ్ ఫైట్ హంగామా
80వ పుట్టిన రోజుకు ట్రంప్ స్పెషల్ ప్లాన్.. వైట్‌హౌస్‌లో కేజ్ ఫైట్ హంగామా

Donald Trump: 80వ పుట్టిన రోజుకు ట్రంప్ స్పెషల్ ప్లాన్.. వైట్‌హౌస్‌లో కేజ్ ఫైట్ హంగామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2026
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకునేందుకు భారీ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఈ వేడుకలో భాగంగా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో యూఎఫ్‌సీ (UFC) 'కేజ్ ఫైట్' నిర్వహించనున్నారు. వైట్‌హౌస్ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి భారీ క్రీడా ఈవెంట్ కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడం విశేషంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ఆదివారం (జులై 14న) రాత్రి జరగనుంది. ఇందుకు సుమారు 60 మిలియన్ డాలర్లు (సుమారు రూ.500 కోట్లు) ఖర్చవుతుందని అంచనా. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం (జులై 4) నేపథ్యంలో ఈ ఈవెంట్‌కు 'UFC ఫ్రీడమ్ 250' అనే పేరు పెట్టారు.

వివరాలు

ఈ ఈవెంట్ కోసం ఏడాది కాలంగా ప్రణాళిక

ట్రంప్‌కు యూఎఫ్‌సీ(UFC)పోటీలపై ప్రత్యేక ఆసక్తి ఉంది. యూఎఫ్‌సీ సీఈఓ డానా వైట్ కూడా ఆయనకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. గతంలో అనేక UFCఈవెంట్లకు హాజరైన ట్రంప్, పోటీలను ప్రత్యక్షంగా వీక్షించారు. వారి దీర్ఘకాల స్నేహానికి గుర్తుగా ఈసారి వైట్‌హౌస్‌లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కోసం ఏడాది కాలంగా ప్రణాళికలు సాగుతున్నట్లు సమాచారం. 'UFC ఫ్రీడమ్ 250'లో వివిధ దేశాల ప్రముఖ ఫైటర్లు పాల్గొని తలపడనున్నారు. ఈ ప్రత్యేక ఈవెంట్ కోసం వైట్‌హౌస్ సౌత్ లాన్‌ను భారీ స్థాయిలో సన్నద్ధం చేశారు. 'ది క్లా'(The Claw)పేరుతో అద్భుతమైన వేదికను నిర్మించారు. 92 అడుగుల ఎత్తు, 154 అడుగుల వెడల్పుతో పాటు 600 టన్నుల బరువుతో తాత్కాలిక పైకప్పు ఏర్పాటు చేశారు.

వివరాలు

నిబంధలనకు విరుద్ధమే

మధ్యలో UFC ఆక్టాగాన్ (కేజ్)ను ఏర్పాటు చేయడంతో పాటు 3,000 నుంచి 4,000 మంది అతిథులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వైట్‌హౌస్ బయట వేలాది మంది ప్రేక్షకుల కోసం భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ తాత్కాలిక నిర్మాణం ఈఫిల్ టవర్‌లా శాశ్వతంగా నిలిచే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఈ నిర్ణయం తీవ్ర వివాదాలకు దారి తీసింది. వైట్‌హౌస్‌లో ప్రైవేట్ క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని కొందరు విమర్శిస్తూ కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ, స్థానిక డిస్ట్రిక్ట్ కోర్టు ఈ విషయంపై జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మరోవైపు, వైట్‌హౌస్ ఈ కార్యక్రమాన్ని సమర్థిస్తూ, దీని నిర్వహణ వ్యయాన్ని పూర్తిగా UFCనే భరిస్తోందని స్పష్టం చేసింది.

Advertisement