LOADING...
Trump: నాటోకు షాక్‌ ఇచ్చిన ట్రంప్.. 'కాగితపు పులి' అంటూ సంచలన వ్యాఖ్యలు

Trump: నాటోకు షాక్‌ ఇచ్చిన ట్రంప్.. 'కాగితపు పులి' అంటూ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ అయిన నాటో నుంచి అమెరికా వైదొలిగే అవకాశాన్ని ఆయన సూచించారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక 'ది టెలిగ్రాఫ్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. నాటో కూటమి బలహీనంగా మారిందని, అది కేవలం 'కాగితపు పులి'లా మారిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ విషయం రష్యాకూ తెలుసునని చెప్పారు. నాటో దేశాల నుంచి వచ్చే మాటలు,హెచ్చరికలు తనపై ఎప్పుడూ ప్రభావం చూపలేదని ట్రంప్ స్పష్టం చేశారు.

వివరాలు 

కూటమి దేశాలపై ట్రంప్ మండిపాటు 

అంతేకాకుండా, హర్మూజ్ జలసంధి సమస్య విషయంలో తమకు మద్దతుగా ముందుకు రావాలని చేసిన పిలుపును పట్టించుకోకపోవడంపై నాటో సభ్య దేశాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హర్మూజ్ జలసంధిని తెరిపించే విషయంలో సహకరించలేదని ఆరోపిస్తూ.. ఆ కూటమి దేశాలపై ట్రంప్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే వారిని 'పిరికివాళ్లు' అంటూ విమర్శించడం గమనార్హం. ఇటీవల ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ భద్రతా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే నాటోపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు భవిష్యత్ పరిణామాలకు సంకేతాలా అన్న చర్చలు జరుగుతున్నాయి. అమెరికా-నాటో సంబంధాలు ఎలా మారబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Advertisement