LOADING...
Trump: ఇరాన్‌ పూర్తిగా పతన స్థితిలో ఉంది.. హోర్ముజ్ జలసంధి తక్షణం తెరవాలని విజ్ఞప్తి: ట్రంప్
హోర్ముజ్ జలసంధి తక్షణం తెరవాలని విజ్ఞప్తి: ట్రంప్

Trump: ఇరాన్‌ పూర్తిగా పతన స్థితిలో ఉంది.. హోర్ముజ్ జలసంధి తక్షణం తెరవాలని విజ్ఞప్తి: ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2026
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ పూర్తిగా పతన స్థితిలో ఉందని, హోర్ముజ్‌ జలసంధిని వెంటనే తెరవాలని తమను కోరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా పంచుకున్నారు. తాజాగా ఇరాన్‌ నుంచి తమకు సమాచారం అందిందని, దేశం కుప్పకూలే పరిస్థితిలో ఉందని వారు తెలియజేసినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. తమ నాయకత్వంలో ఏర్పడిన విభేదాలను సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని, పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అదే సమయంలో, హోర్ముజ్ జలసంధిని వీలైనంత త్వరగా తిరిగి తెరవాలని ఇరాన్‌ కోరుతోందని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇక అమెరికాతో చర్చల విషయంలో ఇరాన్‌ పాలకులు, విప్లవ గార్డుల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ చేసిన పోస్ట్ 

Advertisement