LOADING...
Trump: ఇరాన్'తో యుద్ధాన్ని ముగించిన తర్వాత.. చమురు ధరలు 'భారీగా' తగ్గుతాయి: ట్రంప్ 
ఇరాన్'తో యుద్ధాన్ని ముగించిన తర్వాత.. చమురు ధరలు 'భారీగా' తగ్గుతాయి: ట్రంప్

Trump: ఇరాన్'తో యుద్ధాన్ని ముగించిన తర్వాత.. చమురు ధరలు 'భారీగా' తగ్గుతాయి: ట్రంప్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచం ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు గణనీయంగా తగ్గుతాయని ఆయన తెలిపారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాటలను తప్పుగా చూపించారని ఆరోపించారు. నవంబర్ నాటికి చమురు ధరలు పెరుగుతాయని తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ఇరాన్ యుద్ధం త్వరలో ముగిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయానికి, ముఖ్యంగా నవంబర్ నాటికి చమురు ధరలు గణనీయంగా పడిపోతాయని తెలిపారు.

వివరాలు 

చైనా చాలా హ్యాపీ..

చైనా సంతోషంగా ఉందని ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదికలో పేర్కొన్నారు. త్వరలో హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా తెరవబోతున్నామని తెలిపారు. దీనివల్ల చైనాతో పాటు ప్రపంచ దేశాలన్నీ లాభపడతాయని వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు ఆయుధాల సరఫరా నిలిపివేయడానికి బీజింగ్ అంగీకరించిందని చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. కొద్ది రోజుల్లోనే ఆయనను కలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో యుద్ధ సామర్థ్యంలో అమెరికాను మించిన దేశం మరొకటి లేదని అందరూ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

Advertisement