Donald Trump: తమ చర్యల తీవ్రత ఏంటో ఆరు నెలల్లో వారికి అర్థమవుతుంది: రష్యాకు ట్రంప్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ యుద్ధం ముగింపు పరంగా రష్యా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఆంక్షల ఒత్తిడికి తలొగ్గేది లేదంటూ ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) గట్టిగా బదులిచ్చారు ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ట్రంప్ తాజాగా తీవ్ర హెచ్చరికలు చేశారు. పుతిన్ ఆంక్షలను స్నేహపూర్వక చర్య కాదని పుతిన్ భావించడం తనకు సంతోషంగా ఉందంటూ విలేకరులతో పేర్కొన్నారు. తమ చర్యల తీవ్రత ఏంటో ఆరు నెలల్లో వారికి అర్థమవుతుందన్నారు. ఇదంతా ఎలా జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.
వివరాలు
యుద్ధం ముగింపు విషయంలో పుతిన్ తీరుపై ట్రంప్ గత కొంతకాలంగా నిరాశతో ఉన్నారు
ఈ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ ఆంక్షలు సముచితమైనవి, అవసరమైనవని పేర్కొన్నారు. ట్రంప్ గతంలో కూడా పుతిన్‌ను ఎన్నో సార్లు హెచ్చరించినట్లు, ఇప్పుడు ఆ హెచ్చరికలు అమల్లోకి వచ్చాయని చెప్పారు. యుద్ధం ముగింపు విషయంలో పుతిన్ తీరుపై ట్రంప్ కొంతకాలంగా నిరాశలో ఉన్నారని, రష్యా శాంతి దిశగా ముందుకు రావడంలో ఆసక్తి చూపకపోవడం వైట్ హౌస్‌ను ఆందోళనలో ఉంచిందని ఆమె తెలిపారు. పుతిన్‌తో భేటీ తర్వాత ఏ ఫలితాలు వస్తాయో త్వరగా చెప్పలేమని, కానీ యూఎస్ సానుకూల స్పందన ఆశిస్తున్నట్లు చెప్పారు. లీవిట్ అదనంగా,ట్రంప్ ఈ సమావేశాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశంగా భావిస్తున్నారని,మాటల కంటే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.
వివరాలు
రష్యాకు చెందిన రెండు అతిపెద్ద చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
పదవీకాలం చేపట్టినప్పటి నుంచి ఈ యుద్ధం ముగించేందుకే కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు, రష్యా రెండు అతిపెద్ద చమురు కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు విధించారు. యూరోపియన్ యూనియన్ కూడా రష్యా పై మరిన్ని ఆర్థిక ఆంక్షలను విధించింది. అయితే, ఇవన్నీ తమపై ఒత్తిడి తెచ్చేందుకేనని, ఆత్మగౌరవం ఉన్న ఏ దేశం ఇలాంటి ఒత్తిడి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండదని పుతిన్ స్పష్టంగా తెలిపారు. ఇవి అమెరికా వినియోగదారులపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.