Donald Trump: ఆటోపెన్‌తో బైడెన్ క్షమాభిక్షలు.. అవి చెల్లవన్న ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
జో బైడెన్ ప్రభుత్వ చివరి రోజుల్లో తీసుకున్న క్షమాభిక్ష నిర్ణయాలు చెల్లవని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన తన పాలన చివరి రోజుల్లో జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. బైడెన్ ఇచ్చిన క్షమాభిక్షలపై తనకు పూర్తిగా అవగాహన లేకుండానే వాటిపై ఆటోపెన్ ద్వారా సంతకాలు చేయించారని ట్రంప్ ఆరోపించారు.
వివరాలు
అన్‌సెలెక్ట్ కమిటీ తప్పుడు దర్యాప్తు
''బైడెన్ నిద్రలో ఉండగా, రాజకీయ కుట్రదారులు అనేక మందికి క్షమాభిక్షలు మంజూరు చేశారు. కానీ అవి చట్టబద్ధంగా చెల్లవు, ప్రభావం చూపవు. ఎందుకంటే అవన్నీ ఆటోపెన్ ద్వారా జరిగాయి. నిజానికి, బైడెన్ వాటిపై స్వయంగా సంతకం కూడా చేయలేదు. అసలు, ఆయనకు ఈ ప్రక్రియ గురించి సరైన సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ వ్యవహారాన్ని నడిపినవారు నేరపూరితంగా వ్యవహరించారు. ఆ తర్వాత అదే రాజకీయ కుట్రదారుల అన్‌సెలెక్ట్ కమిటీ నాతో సహా మరికొందరు అమాయకులపై రెండు సంవత్సరాల పాటు తప్పుడు దర్యాప్తు జరిపారు. దర్యాప్తులో సంపాదించిన ముఖ్యమైన ఆధారాలను నాశనం చేశారు. వారు ఇప్పుడు తీవ్రమైన దర్యాప్తుకు సిద్ధంగా ఉండాలని అర్థం చేసుకోవాలి'' అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో హెచ్చరించారు.
వివరాలు
బైడెన్ కుమారుడికి కూడా క్షమాభిక్ష మంజూరు
బైడెన్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి కొద్ది గంటల ముందు అనేక మందికి క్షమాభిక్షలు మంజూరు చేశారు.
ఈ జాబితాలో ఆయన కుటుంబ సభ్యులు జేమ్స్, ఫ్రాన్సిస్ (సోదరులు), వేలేరి (సోదరి) వారి జీవిత భాగస్వాములు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా ట్రంప్ స్పందిస్తూ, తాను రాజకీయ వేధింపులకు గురయ్యేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.
అదేవిధంగా,బైడెన్ తన కుమారుడు హంటర్‌కు కూడా క్షమాభిక్ష మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం హంటర్ వెకేషన్ కోసం దక్షిణాఫ్రికాలో ఉన్నారు.డిసెంబర్ 12న ఒక్క రోజులోనే 1,500 మంది ఖైదీల శిక్షలను తగ్గించారు.
మరో 39మంది ఖైదీలను పూర్తిగా క్షమించారు. అమెరికా ఆధునిక చరిత్రలో ఈ స్థాయిలో క్షమాభిక్షలు ఎవ్వరూ మంజూరు చేయలేదని ట్రంప్ విమర్శించారు.