LOADING...
Trump: టారిఫ్‌లపై ట్రంప్‌ ఘాటు వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు నిర్ణయంతో అమెరికా భద్రతకు ముప్పు అంటూ హెచ్చరిక!
సుప్రీంకోర్టు నిర్ణయంతో అమెరికా భద్రతకు ముప్పు అంటూ హెచ్చరిక!

Trump: టారిఫ్‌లపై ట్రంప్‌ ఘాటు వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు నిర్ణయంతో అమెరికా భద్రతకు ముప్పు అంటూ హెచ్చరిక!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

విదేశీ దేశాలపై ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల అంశంపై అమెరికా సుప్రీంకోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగా, ఈ వ్యవహారంపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్సిల్వేనియాలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. టారిఫ్‌లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది అమెరికా భద్రతకు తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని అన్నారు. సుంకాలను వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తాను తీసుకున్న నిర్ణయాల వల్ల వందల బిలియన్‌ డాలర్ల ఆదాయం దేశానికి వచ్చిందని తెలిపారు. రాబోయే రోజుల్లో తన పాలనలో మరిన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు, ఫలితాలు కనిపిస్తాయని ట్రంప్‌ స్పష్టం చేశారు.

వివరాలు 

ఇతర దేశాలు తమ దేశం విషయంలో ఎలా అయితే ప్రవర్తిస్తున్నాయో.. 

ఇంతేకాక, తనకు ప్రతికూలంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తే అమెరికా ఆర్థికంగా రక్షణ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందని సోషల్‌మీడియా వేదికగా ఆందోళన వెల్లడించారు. ఇతర దేశాలు తమ దేశంతో ఎలా వ్యవహరిస్తున్నాయో, తాము కూడా అదే విధంగా స్పందిస్తామని పేర్కొన్నారు. అలా వ్యవహరించకుండా తమను ఎవరూ నిలువరించరాదని స్పష్టం చేశారు. వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఇతర దేశాలపై సుంకాలు అమలు చేయడం వల్ల అమెరికా జాతీయ భద్రత మరింత బలపడిందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు 

ట్రంప్‌ నిర్ణయాన్ని కొన్ని న్యాయస్థానాలు అడ్డుకున్నాయి

అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికార చట్టాన్ని ఆధారంగా తీసుకుని ట్రంప్‌ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ చట్టాన్ని వినియోగించే సమయంలో ఫెడరల్‌ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించారని కొన్ని వర్గాలు ఆరోపించడంతో పాటు, ఆ కారణంగా పలువురు న్యాయస్థానాలు ఆయన నిర్ణయాలకు అడ్డంకులు విధించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.

Advertisement