Trump: హెగ్సెత్‌కు మద్దతుగా ట్రంప్.. మాసీపై విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై అభిశంసన ప్రతిపాదన తెరపైకి రావడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హెగ్సెత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయనను పదవి నుంచి తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెండు యుద్ధాల్లో విజయం సాధించిన వ్యక్తిని ఇప్పుడు అభిశంసించాలని కోరడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాసీపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు.
వివరాలు
పీట్ హెగ్సెత్ రెండు యుద్ధాల్లో విజయం సాధించారు: ట్రంప్
ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యల విషయంలో హెగ్సెత్‌ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ట్రంప్ అన్నారు.
గతంలో వియత్నాం, ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాలకు బాధ్యులైన వారిపై ఎందుకు అభిశంసన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
పీట్ హెగ్సెత్ రెండు యుద్ధాల్లో విజయం సాధించారని, అలాంటి వ్యక్తిపై ఇప్పుడు అభిశంసనకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు.
వియత్నాం యుద్ధాన్ని నడిపించిన వారిని ఎందుకు అభిశంసించలేదని నిలదీశారు.
ఇరాక్, అఫ్గానిస్తాన్ యుద్ధాలకు బాధ్యులైన వారిని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఆ యుద్ధాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వివరాలు
థామస్ మాసీని తీవ్రంగా విమర్శించినా ట్రంప్
గతంలో ఎలాంటి ప్రయోజనం లేకుండా సాగిన యుద్ధాలకు బాధ్యులైన నాయకులపై చర్యలు తీసుకోకుండా, ఇప్పుడు హెగ్సెత్‌ను లక్ష్యంగా చేసుకోవడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన కెంటకీ రిపబ్లికన్ ప్రతినిధి థామస్ మాసీని కూడా తీవ్రంగా విమర్శించారు.
మాసీ ఓటమిపాలైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, సెనేట్ సమయాన్ని ఆయన వృథా చేస్తున్నారని అన్నారు.
ఎంత మంచి బిల్లును తీసుకొచ్చినా మాసీ వ్యతిరేకంగానే ఓటు వేస్తారని విమర్శించారు. ఆయన వైఖరిలో ఏదో సమస్య ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
వివరాలు
హెగ్సెత్‌పై ఎనిమిది అభిశంసన ఆర్టికల్స్
కాగా, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు థామస్ మాసీ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ఎనిమిది అభిశంసన ఆర్టికల్స్‌ను సభలో ప్రవేశపెట్టారు.
కాంగ్రెస్ ఆమోదం లేకుండానే ఇరాన్‌తో యుద్ధానికి వెళ్లడం, రక్షణ శాఖాధిపతిగా తనకున్న అధికారాలను దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలతో ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు మాసీ వెల్లడించారు.
ఈ పరిణామంతో ఇరాన్ యుద్ధ వ్యవహారంపై రిపబ్లికన్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చాయి.
మరోవైపు హెగ్సెత్‌పై అభిశంసన ప్రయత్నాలను ట్రంప్ వ్యతిరేకిస్తూ ఆయనకు అండగా నిలిచారు.