LOADING...
Trump: హోర్ముజ్ జలసంధిలో అక్రమ వసూళ్లు ఆపాలి.. లేకపోతే తీవ్రమైన పరిణామాలు: ట్రంప్ హెచ్చరిక
ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక

Trump: హోర్ముజ్ జలసంధిలో అక్రమ వసూళ్లు ఆపాలి.. లేకపోతే తీవ్రమైన పరిణామాలు: ట్రంప్ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2026
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా చల్లారకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ చేస్తున్న అక్రమ వసూళ్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చమురు ట్యాంకర్లు ఈ మార్గం గుండా ప్రయాణించే సమయంలో ఇరాన్ అన్యాయంగా రుసుములు వసూలు చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. ఇది సిగ్గుచేటైన చర్య అని, ఒప్పందాలకు విరుద్ధమని పేర్కొంటూ వెంటనే ఈ వసూళ్లు నిలిపివేయాలని తన సామాజిక మాధ్యమం ద్వారా స్పష్టం చేశారు. యుద్ధ విరమణ అమల్లో ఉన్న సమయంలో కూడా ఇలాంటి చర్యలు కొనసాగడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

వివరాలు 

పాకిస్థాన్ వేదికగా చర్చలు https://www.hmtvlive.com/telugu-news/international/trump-warns-iran-over-hormuz-strait-toll-fees-high-level-talks-in-pakistan-soon-145371

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేపట్టింది. ఏప్రిల్ 11న Islamabadలో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఈ చర్చల కోసం అమెరికా నుంచి ఇప్పటికే 30 మంది సభ్యుల బృందం అక్కడికి చేరుకుంది. ఇదే సమయంలో NATO దేశాలు కూడా హోర్ముజ్ జలసంధి భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రంప్ సూచించినట్లు నాటో ప్రధాన కార్యదర్శి Mark Rutte తెలిపారు.

వివరాలు 

లెబనాన్‌తో ఇజ్రాయెల్ చర్చలు  

ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరాలుగా విభేదాలు కొనసాగుతున్న లెబనాన్ తో నేరుగా చర్చలు జరిపేందుకు అంగీకరించారు. హిజ్బుల్లాను నిరాయుధులను చేయడం, సరిహద్దుల్లో శాంతి స్థాపన లక్ష్యంగా వచ్చే వారం వాషింగ్టన్ వేదికగా ఈ చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే హిజ్బుల్లాపై దాడులు మాత్రం కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టం చేశారు.

Advertisement

వివరాలు 

శాంతి ఒప్పందాలపై సందేహాలు 

ట్రంప్ తాజా వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో శాంతి ఒప్పందంపై సందేహాలను మరింత పెంచుతున్నాయి. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన ఆధిపత్యాన్ని కొనసాగించడం అమెరికాకు అనుకూలంగా లేదని ఆయన భావిస్తున్నారు. చమురు రవాణా నౌకల నుంచి ఆదాయం పెంచుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే తాము నిశ్శబ్దంగా ఉండబోమని పరోక్షంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరగబోయే చర్చలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Advertisement