Trump-Iran: ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై దాడులు.. ట్రంప్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో అమెరికా ఒప్పందం కుదరకపోతే మరోసారి సైనిక చర్య చేపట్టే అవకాశాలున్నాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ఈ వారాంతంలో ఇరాన్‌పై అమెరికా దాడులు జరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. పశ్చిమాసియాలో మరో పరిమిత స్థాయి 'ఎపిక్ ఫ్యూరీ' ఆపరేషన్ జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇటీవల తుర్కియేలోని అమెరికా రాయబారి టామ్ బారక్ కూడా ఈ వారాంతంలో ఇరాన్‌పై దాడులు జరిగే అవకాశాలున్నాయని ఓ పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యానించారు. అయితే, తొలుత ట్రంప్ ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు.
వివరాలు
ఇరాన్ తీవ్ర హెచ్చరిక
బారక్ తమ రాయబారేనని, ఆయనకు మంచి పలుకుబడి ఉండొచ్చని చెబుతూనే.. దాడులకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యల గురించి తనకు తెలియదని పేర్కొన్నారు.
అయితే, ఇప్పుడు స్వయంగా ట్రంప్ మరోసారి సైనిక చర్యకు అవకాశం ఉందని సంకేతాలివ్వడం గమనార్హం.
దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
అమెరికా నుంచి మరోసారి దాడులు జరిగే అవకాశం ఉందన్న వార్తలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
తమతో నిప్పుతో చెలగాటమాడొద్దని హెచ్చరించింది. తమపై దాడులు జరిగితే గల్ఫ్ ప్రాంతంలోని సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుళ్లను ధ్వంసం చేస్తామని ఇప్పటికే స్పష్టం చేసినట్లు పేర్కొంది.
వివరాలు
ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ఇరాన్‌పై మరోసారి దాడులు జరిగితే ఎలాంటి పరిమితులూ ఉండవని హెచ్చరించింది.
సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుళ్లతో పాటు సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో ఇరాన్‌పై దాడులు చేపట్టింది.
అప్పటి నుంచి పశ్చిమాసియాలో వివిధ రూపాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి.
ఈ పరిణామాల ప్రభావంతో చమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడే ఆందోళనలు పెరిగాయి.
ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, సరఫరా పరిస్థితులపై అనిశ్చితి నెలకొంది.