LOADING...
Trump-Iran: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. భారీ దాడులు చేస్తామన్న ట్రంప్
ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. భారీ దాడులు చేస్తామన్న ట్రంప్

Trump-Iran: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. భారీ దాడులు చేస్తామన్న ట్రంప్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా చర్యలు చేపట్టినప్పటికీ, టెహ్రాన్ తన ప్రయత్నాలను నిలిపివేయలేదని ట్రంప్ అన్నారు. అమెరికా పలుమార్లు హెచ్చరించినా, వాటిని ఇరాన్ విస్మరించిందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ నుంచి ఉద్భవిస్తున్న అణు ముప్పును పూర్తిగా తొలగించాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అవసరమైతే భూతల దాడులు కూడా చేపట్టేందుకు వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరించారు.

వివరాలు 

సైనిక ఆపరేషన్ ఐదు నుంచి ఏడు వారాల వరకు కొనసాగవచ్చు: ట్రంప్

పరిస్థితి విషమిస్తే అమెరికా దళాలను కూడా మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇరాన్ ఇప్పటికే అమెరికాను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఉన్న క్షిపణులను అభివృద్ధి చేసిందని ట్రంప్ వెల్లడించారు. "వారి వద్ద అమెరికాను ఢీకొట్టగల క్షిపణులు ఉన్నాయి.అయితే అలాంటి పరిస్థితి ఏర్పడనివ్వను. గత 47సంవత్సరాలుగా ఈ ఇరాన్ ప్రభుత్వం అమెరికన్లపై దాడులకు పాల్పడుతోంది.ఈ దుష్ట ప్రభుత్వంపై చర్యలు తీసుకునేందుకు ఇదే మాకు చివరి అవకాశం" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సైనిక ఆపరేషన్ ఐదు నుంచి ఏడు వారాల వరకు కొనసాగవచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. "మా లక్ష్యం ఒక్కటే.. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాలను పూర్తిగా నిర్మూలించడం. వారికి అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు మేమెట్టి పరిస్థితుల్లోనూ అనుమతించము" అంటూ ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు.

Advertisement