Loading...
Trump: ముప్పు అంచున యూకే.. వలసలు, ఇంధన ధరలపై ట్రంప్ హెచ్చరిక
ముప్పు అంచున యూకే.. వలసలు, ఇంధన ధరలపై ట్రంప్ హెచ్చరిక

Trump: ముప్పు అంచున యూకే.. వలసలు, ఇంధన ధరలపై ట్రంప్ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2026
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వలసలు, అధిక ఇంధన ధరల కారణంగా యూకే తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని హెచ్చరించారు. బ్రిటన్ ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాలు దేశానికి సమస్యగా మారుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గురువారం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్‌తో పాటు ఆ దేశ రాజు చార్ల్స్‌ అంటే తనకు ఎంతో అభిమానం ఉందని ట్రంప్ చెప్పారు. అయితే యూకే ప్రభుత్వం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. ''మీ దేశం సమస్యల్లో ఉంది. ముప్పు అంచున నిలిచింది.వలసల సమస్య తీవ్రంగా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇంధన ధరలు మూడు, నాలుగు రెట్లు అధికంగా ఉన్నాయి'' అని ట్రంప్ పేర్కొన్నారు.

వివరాలు 

బ్రిటన్ ముడిచమురు,సహజవాయువు నిల్వల అన్వేషణపై దృష్టి పెట్టాలి: ట్రంప్ 

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి బ్రిటన్‌లోకి వస్తున్న వలసలను నియంత్రించకపోతే భవిష్యత్తులో ఆ దేశానికంటూ ప్రత్యేక గుర్తింపు మిగలకపోవచ్చని ట్రంప్ హెచ్చరించారు.

వలసల విషయంలో బ్రిటన్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.

శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధనాల వైపు బ్రిటన్‌ దృష్టి సారించడాన్ని ట్రంప్ గతంలోనూ పలుమార్లు విమర్శించారు.

ముఖ్యంగా ఉత్తర సముద్రంలో ఉన్న ముడిచమురు, సహజవాయువు నిల్వల అన్వేషణపై దృష్టి పెట్టాలని బ్రిటన్ పాలకులకు సూచించారు.

ఈ ప్రతిపాదనను బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

నేర ముఠాలపై చర్యలు

ఇదిలా ఉండగా, సముద్రమార్గం ద్వారా బ్రిటన్‌లోకి అక్రమంగా వలసలను ప్రోత్సహిస్తున్న క్రిమినల్ గ్యాంగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని బర్న్‌హామ్ ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది.

అక్రమ వలసలను అడ్డుకోవడంతో పాటు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేర ముఠాలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

ADVERTISEMENT