Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.5తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ఫిలిప్పీన్స్(Philippines)లోని మిండానావోలో శనివారం భారీ భూకంపం(Earthquake) సంభవించింది. ఈ మేరకు రిక్టర్ స్కేలుపై 7.6తీవ్రత నమోదైట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. భూకంపం 63 కిమీ (39 మైళ్లు) లోతులో కేంద్రీకృతమనట్లు EMSC వెల్లడించింది. భూకంపం తరువాత.. అమెరికాకు చెందిన సునామీ హెచ్చరిక వ్యవస్థ.. సునామీ హెచ్చరికను జారీ చేసింది. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పలావు, మలేషియా, జపాన్‌ను సునామీ తరంగాలు తాకవచ్చని భావిస్తున్నట్లు పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. గతనెల నవంబర్ 17న దక్షిణ మిండనావో ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.