LOADING...
Turkey military plane crash: కూలిన టర్కీ మిలిటరీ విమానం.. వీడియో వైరల్..
కూలిన టర్కీ మిలిటరీ విమానం.. వీడియో వైరల్..

Turkey military plane crash: కూలిన టర్కీ మిలిటరీ విమానం.. వీడియో వైరల్..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

జార్జియా భూభాగంలో టర్కీకి చెందిన ఒక సైనిక విమానం గాల్లోనే నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. అజర్‌బైజాన్ నుంచి టర్కీకి బయలుదేరిన ఈ విమానం జార్జియా గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదానికి గురై గింగిరాలు తిరుగుతూ నేలపై పడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. సి-130 మోడల్‌కు చెందిన ఆ టర్కీ సైనిక విమానంలో మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారని సమాచారం. అజర్‌బైజాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా, జార్జియాలోని సిగ్నాఘి ప్రాంతం వద్ద ఇది గాల్లోనే మంటలు చెలరేగడంతో నియంత్రణ తప్పి కూలిపోయింది. మంటలు, పొగలు చుట్టుముట్టిన కారణంగా విమానంలోని అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.

వివరాలు 

 విమానంలోని 20 మంది సైనిక సిబ్బంది మృతి 

ఈ విషాద ఘటనను టర్కీ రక్షణ శాఖతో పాటు జార్జియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కూడా ధృవీకరించాయి. ప్రమాద స్థలంలో సహాయక బృందాలు తక్షణమే చేరి రక్షణ చర్యలు ప్రారంభించాయి. అయితే, ప్రమాదం తీవ్రత దృష్ట్యా విమానంలోని 20 మంది సైనిక సిబ్బందంతా మరణించినట్లు టర్కీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..