Page Loader
Twins separated at birth: పుట్టుగానే వేరైనా కవలలు..మళ్లీ 19 ఏళ్ల తర్వాత కలిశారు 
పుట్టుగానే వేరైనా కవలలు..మళ్లీ 19 ఏళ్ల తర్వాత కలిశారు

Twins separated at birth: పుట్టుగానే వేరైనా కవలలు..మళ్లీ 19 ఏళ్ల తర్వాత కలిశారు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 26, 2024
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూరోపియన్‌ దేశమైన జార్జియాలో పుట్టిన ఇద్దరు కవలలు పుట్టగానే అనుకోకుండా వేరయ్యారు. ఒకరి తెలియకుండా ఒకరు ఒకే చోట పెరిగారు. ఇద్దరు ఒకే చోట పెరిగినా ఎప్పుడు ఒకరికిఒకరు తారసపడలేదు. అనుకోకుండా 19 ఏళ్ళ తరువాత టిక్‌టాక్ వీడియో,టాలెంట్ షో ద్వారా ఇద్దరు కలుసుకున్నారు. అచ్చం తెలుగులో వచ్చిన గంగ-మంగ సినిమాలా ఆధ్యాంతం ట్విస్ట్‌లతో సాగిన గాథ వారిది. అసలు విషయంలోకి వస్తే అమీ ఖ్విటియా, అనో సార్టానియా కవలలు.వీరిద్దరూ పుట్టగానే వేరయ్యారు. అనుకోకుండా ఒకే నగరంలో వేర్వేరు చోట్ల నివశించారు. అమీ 'జార్జియాస్ గాట్ టాలెంట్' టివి షో చూస్తుండగా ఒక అమ్మాయి అచ్చం తన పోలికలతో ఉండడం గమనించింది.

Details 

టిక్‌టాక్ వీడియోలో అమీ

ఆ అమ్మాయి ఆ ప్రోగ్రాం లో డ్యాన్స్ చేస్తోంది.తన పోలికతో ఉండి, డ్యాన్స్ చేస్తున్న ఆ అమ్మాయి చాలా కాల క్రితం వేరయ్యిన తన సోదరి అని ఆమెకు అప్పటికి తెలియదు. మరోవైపు,నీలిరంగు జుట్టుతో తనలాగే ఉన్న ఓ మహిళకి సంబంధించిన టిక్‌టాక్ వీడియో అనోకు చేరింది. వీడియోలో ఉన్న మహిళ అమీ ఆమె కవల అని నిర్ధారించుకుంది. ఎలా వేరయ్యారంటే.. అజా షోనీ, 2002లో ఈ కవలలకి జన్మనిచ్చింది. ఆ తరువాత అజా కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమె భర్త గోచా గఖారియా అనో, అమీలను అమ్మేశాడు. ఇలా వారిరువురు వేరు కుటుంబాల వద్ద ఒకే నగరంలో నివశించడం జరిగింది.

Details 

డాన్స్ పోటీలో పాల్గొన్న కవలలు.. 

అనో టిబిలిసిలోపెరిగితే.. అమీ జుగ్దిడిలో పెరిగింది. ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదు. 11 సంవత్సరాల వయస్సులో ఇద్దరు ఒక డాన్స్ పోటీలో పాల్గొన్నప్పటికీ, ఒకరిని ఒకరు చూసుకోలేదు. అయితే, కవలలు ఎలా విడిపోయాము అని ఆలోచించినప్పుడు వారికీ దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని తెలిసింది. అదేంటంటే జార్జియన్ ఆసుపత్రుల నుండి దొంగిలించబడి, విక్రయించబడిన వేలాది మంది శిశువులలో వారు ఇద్దరు మాత్రమే ఉన్నారు. మిగతా వారి ఆచూకి తెలియరాలేదు. 2005 నాటికి ఇటువంటి కేసులు చాలానే నమోదయ్యాయి. BBC నివేదిక ప్రకారం, ఈ సంఘటన జార్జియా రాజధాని టిబిలిసిలోని రుస్తావేలీ వంతెనపై రెండేళ్ల క్రితం జరిగింది. అమీ,అనో 19 సంవత్సరాల క్రితం విడిపోయిన తర్వాత మొదటిసారి కలుసుకున్నారు.