 
                                                                                Louvre jewel heist: లూవ్ర్ మ్యూజియం దోపిడీ కేసు: ఇద్దరు అనుమానితుల అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్‌లోని ప్రముఖ లూవ్ర్ మ్యూజియం దోపిడీ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ జరిగిన వారంరోజుల తర్వాత, శనివారం రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. వివరాల ప్రకారం, పారిస్‌లోని చార్ల్స్ డి గాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో, అల్జీరియాకు వెళ్తున్న ఓ అనుమానితుడిని అధికారులు ఆపి అరెస్టు చేశారు. తరువాత, పారిస్ వీధుల్లో సందేహాస్పదంగా తిరుగుతున్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
వివరాలు
నెపోలియన్ కాలానికి చెందిన తొమ్మిది విలువైన వస్తువులు, ఆభరణాలు చోరీ
ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తుచేసుకుంటే. ఈ నెల 19న లూవ్ర్ మ్యూజియంలో జరిగిన దోపిడీలో, నెపోలియన్ కాలానికి చెందిన తొమ్మిది విలువైన వస్తువులు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వీటి మొత్తం విలువ 88 మిలియన్ యూరోలు, అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.895 కోట్లు అవుతుంది.