
Minneapolis Catholic school Mass: అమెరికా స్కూల్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపొలిస్‌లోని ఒక క్యాథలిక్ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన వ్యక్తి కూడా మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు. వారిలో 14 మంది విద్యార్థులే అని అధికారులు వెల్లడించారు. మినియాపొలిస్ పోలీస్ చీఫ్ బ్రియాన్ ఓహారా తెలిపిన వివరాల ప్రకారం, విద్యార్థులు ప్రార్థనలు చేస్తున్న సమయంలోనే కాల్పులు జరిగాయి.
వివరాలు
ఘటనలో నిందితుడూ చనిపోయాడు
పలు ఆయుధాలతో అక్కడికి వచ్చిన నిందితుడు కిటికీల గుండా పిల్లలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని ఆయన వివరించారు. అనంతరం ఆ నిందితుడు కూడా మృతిచెందాడని, అతడి వయసు 20ల్లో ఉంటుందని చెప్పారు. ఈ సంఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణ ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.