Loading...
New York: న్యూయార్క్‌లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
న్యూయార్క్‌లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

New York: న్యూయార్క్‌లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రూక్లిన్ బరోలోని ఫ్లాట్‌బుష్ (Flatbush) ప్రాంతంలో నిర్మాణ స్థలానికి సమీపంలో ఉన్న మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సాయంత్రం 4 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. భవనం కూలిపోవడంతో పెద్దఎత్తున శిథిలాలు పేరుకుపోయాయి. వాటి కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

వివరాలు 

అత్యంత విషమంగా నలుగురి పరిస్థితి

ఈ ప్రమాదంపై న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ మీడియాతో మాట్లాడారు.

ఈ ఘటనలో గాయపడిన వారిలో కనీసం 10 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపారు.

మరోవైపు, శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై ఇప్పుడే కచ్చితమైన అంచనాకు రాలేమని న్యూయార్క్ సిటీ ఫైర్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జాన్ ఎస్పోసిటో పేర్కొన్నారు.

బాధితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సహాయక చర్యలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కుప్పకూలిన మూడంతస్తుల భవనం

ADVERTISEMENT