LOADING...
Plane Crashes: వెనెజువెలాలో ఘోర ప్రమాదం.. టేకాఫ్‌ అవుతూ కుప్పకూలిన విమానం.. ఎగసిపడ్డ మంటలు.. VIDEO
టేకాఫ్‌ అవుతూ కుప్పకూలిన విమానం.. ఎగసిపడ్డ మంటలు.. VIDEO

Plane Crashes: వెనెజువెలాలో ఘోర ప్రమాదం.. టేకాఫ్‌ అవుతూ కుప్పకూలిన విమానం.. ఎగసిపడ్డ మంటలు.. VIDEO

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెనెజువెలాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. టాచిరాలోని పరమిల్లో ఎయిర్‌పోర్ట్‌లో (Paramillo Airport) చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ టేకాఫ్‌ అయ్యింది. విమానం రన్‌వే నుంచి ఎగరగానే ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ కిందపడిపోయింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వెనెజువెలాలో ఘోర విమాన ప్రమాదం