LOADING...
Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు
Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు

Houthi rebels: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన 'హౌతీ'లు.. రెండు నౌకలపై డ్రోన్ దాడులు

వ్రాసిన వారు Stalin
Feb 07, 2024
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. తాజాగా మంగళవారం ఎర్ర సముద్రంలో రెండు నౌకలపై హౌతీ రెబెల్స్ డ్రోన్ దాడి చేసినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ అండ్ సెక్యూరిటీ సంస్థ ఆంబ్రే తెలిపింది. మొదటి దాడి ఎర్ర సముద్రం దక్షిణ భాగంలోని యెమెన్ నౌకాశ్రయానికి పశ్చిమాన జరిగినట్లు యూకే సంస్థ తెలిపింది. అయితే ఈ దాడిలో నౌక కిటికీలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు వెల్లడించింది. ఈ దెబ్బతిన్న నౌకను యూకేకు చెందిన కార్గో షిప్‌గా ఆంబ్రే చెప్పింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని వివరించింది.

హౌతీ

భారత్‌కు వస్తున్న అమెరికా ఓడపై దాడి

యెమెన్‌లోని దక్షిణ ఓడరేవు నగరమైన ఏడెన్‌ సమీపంలో రెండో దాడి జరిగినట్లు యూకేఎంటీఓ(UKMTO) పేర్కొంది. అమెరికా నుంచి భారత్ వెళ్తున్న క్రమంలో హౌతీ తిరుగుబాటదారులు ఆ దాడికి పాల్పడినట్లు అంబ్రే సంస్థ వివరించింది. ఈ దాడిలో కూడా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. ఈ దాడులను తామే చేసినట్లు ఇరాన్‌ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. మొదటి దాడి అమెరికన్ షిప్ స్టార్ నాసియాను లక్ష్యంగా చేసుకున్నామని, రెండోది బ్రిటిష్ నౌక మార్నింగ్ టైడ్‌పై దాడి చేసినట్లు ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే, హౌతీని గత నెలలోనే అమెరికా అమెరికా ప్రపంచ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.