U.N. report: ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతున్నారు: నివేదిక
ఇక్కడ వివాహిత మహిళలు,ఇంట్లో ఉండే యువతుల ప్రాణాలకు రక్షణ లేకుండా, హత్యలకు గురవుతున్న వారి చావుల్లో 60 శాతం భర్తలు,కుటుంబ సభ్యులే బాధ్యులుగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్త్రీ హత్యలపై జరిపిన అధ్యయనంలో ఈ షాకింగ్ ఫలితాలు బయటపడ్డాయి. ఆడవాళ్లకు అక్కడ నో సేఫ్టీ.. 2023లో పురుషుల చేతుల్లో హత్యకు గురైన 85,000 మంది మహిళల్లో 60 శాతం మంది వారి జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలోనే మరణించారని నివేదికలు తెలిపాయి. యునైటెడ్ నేషన్స్ తాజా లెక్కల ప్రకారం, ఏ దేశం అత్యధిక స్త్రీ హత్యలకు గురయ్యిందో మనం పరిశీలిద్దాం.
మహిళలకు రక్షణేది..
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 140 మంది మహిళలు లేదా యువతులు తమ భాగస్వాముల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. స్త్రీ హత్యలపై ప్రపంచ వ్యాప్తంగా చేసిన అధ్యయనంలో ఈ విషయాలు తేలాయి. నమ్మలేని నిజాలు.. UN మహిళల నివేదిక ప్రకారం, 2023లో 85,000 మంది మహిళలు, యువతులు ఉద్దేశపూర్వకంగా పురుషుల చేతిలో చంపబడ్డారు. ఈ హత్యలలో 60% (51,100) బాధితురాలికి అత్యంత సన్నిహితమైనవారే కారణమయ్యారని నివేదికలో పేర్కొనబడింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇంట్లోనే ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
సొంత కుటుంబ సభ్యులే హంతకులు
వివాహిత మహిళల హత్యలకు సంబంధించిన వివరాలపై UN ఉమెన్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ, "డేటా చెప్పేది ఏమిటంటే మహిళలు, ముఖ్యంగా ఇంట్లోనే పెద్ద హింసలకు గురవుతున్నారు" అని చెప్పారు. షాకింగ్ నివేదిక UN వారు 2022లో స్త్రీలు, బాలికలను లక్ష్యంగా చేసుకున్న 89,000 మంది ఉద్దేశపూర్వక మరణాలు నమోదు అయినట్లు తెలిపారు. కానీ, కుటుంబ సభ్యుల చేతిలో హత్యలు పెరిగాయని నివేదికలో వెల్లడించారు. అమెరికా రెండో స్థానంలో UN డేటా ప్రకారం,ఆఫ్రికాలో లింగ-సంబంధిత హత్యలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.2023లో 21,700 మంది బాధితులుగా అంచనా వేయబడింది.రెండో స్థానంలో అమెరికా,తరువాత ఓషియానియా దేశాలు ఉన్నాయి. ఐరోపా, అమెరికా దేశాల్లో ఎక్కువ మంది మహిళలు తమ సన్నిహిత భాగస్వాముల చేతిలో మరణించారని నివేదికలు సూచిస్తున్నాయి.