Loading...
Russia Sanctions Act: రష్యా ఆంక్షల బిల్లులో భారత్‌ పేరు చేర్చాలని డెమోక్రాట్ల ప్రతిపాదన
రష్యా ఆంక్షల బిల్లులో భారత్‌ పేరు చేర్చాలని డెమోక్రాట్ల ప్రతిపాదన

Russia Sanctions Act: రష్యా ఆంక్షల బిల్లులో భారత్‌ పేరు చేర్చాలని డెమోక్రాట్ల ప్రతిపాదన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
12:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్‌, చైనా వంటి దేశాలపై భారీ టారిఫ్‌లు విధించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన కీలకమైన రష్యా ఆంక్షల బిల్లు (Russia Sanctions Act)ను ఈ వారం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఈ బిల్లులో భారత్‌ పేరును నేరుగా చేర్చాలని డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన కొందరు చట్టసభ్యులు ప్రతిపాదించారు.

వివరాలు 

సెనెట్‌లో ఇప్పటికే ఆమోదం

దివంగత సెనెటర్‌ లిండ్సే గ్రాహమ్‌ పేరు మీదుగా రూపొందించిన 'శాంక్షనింగ్‌ రష్యా, ఇరాన్‌ యాక్ట్‌ 2026'ను అమెరికా సెనెట్‌ ఇప్పటికే 86-11 ఓట్ల తేడాతో ఆమోదించింది.

అయితే, ప్రస్తుత బిల్లులో రష్యా వాణిజ్య భాగస్వామ్య దేశాల పేర్లను నేరుగా ప్రస్తావించలేదు.

కేవలం రష్యా నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతి చేసుకునే ఐదు అతిపెద్ద దేశాలుగా పేర్కొన్నారు. ఈ అంశంలో మార్పులు చేయాలని తాజాగా చట్టసభ్యులు ప్రతిపాదించారు.

వివరాలు 

100 శాతం టారిఫ్‌లు ఎదుర్కొనే దేశాల జాబితాలో భారత్

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం టారిఫ్‌లు విధించే అవకాశం ఉన్న జాబితాలో భారత్‌తో పాటు చైనా, తుర్కియే, అజర్‌బైజాన్‌, హంగేరీ, స్లోవాకియా, యూఏఈ, సింగపూర్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ దేశాలను చేర్చాలని డెమోక్రాటిక్‌ పార్టీ ప్రతినిధి స్టేనీ హోయర్‌ ప్రతిపాదించారు.

ఇదే సమయంలో.. రష్యా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై విస్తృత సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పించే సెక్షన్‌ 113ను పూర్తిగా తొలగించాలని మరో డెమోక్రటిక్‌ నేత ప్రతిపాదించడం గమనార్హం.

ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందిన అనంతరం అధ్యక్షుడి సంతకంతో అది చట్టంగా మారుతుంది.

నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందే ఈ బిల్లుకు ఆమోదం లభించేలా చూడాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

రష్యాపై ఒత్తిడి పెంచడమే లక్ష్యం

ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.

గతంలో ట్రంప్‌ దీనిని 'ఆర్థిక బంకర్‌ బస్టర్‌'గా అభివర్ణించారు.

రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకునేలా బిల్లును రూపొందించారు.

మాస్కో నుంచి చమురు దిగుమతులు చేసుకునే దేశాలపై అసాధారణ స్థాయిలో సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఈ బిల్లు కల్పిస్తుంది.

ADVERTISEMENT