LOADING...
UAE: యూఏఈ కొత్త వీసా రూల్స్.. పర్యాటకులకు నూతన అవకాశాలు
యూఏఈ కొత్త వీసా రూల్స్.. పర్యాటకులకు నూతన అవకాశాలు

UAE: యూఏఈ కొత్త వీసా రూల్స్.. పర్యాటకులకు నూతన అవకాశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2025
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తన వీసా, రిజిడెన్సీ విధానంలో నూతన మార్పులను తీసుకొచ్చింది. తాజాగా 4 కొత్త వీసా రకాల్ని ప్రవేశపెట్టడంతో పాటు, వలసదారులు, వలస కార్మికులు, ప్రత్యేక అవసరాలు ఉన్న వర్గాల కోసం కొత్త అవకాశాలను కల్పించింది. ఈ మార్పులు ప్రధానంగా గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించడానికి, పర్యాటకులకు సౌకర్యాన్ని అందించడానికి, సమాజంలో క్లూసివిటీ (అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు) మెరుగుపరచడానికే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది.

Details

వృత్తిపరులకు ఉపయోగకరం

ఇది ముఖ్యంగా భారతీయ వృత్తిపరుల కోసం ఇది మంచి శుభపరిణామనని చెప్పొచ్చు. ఇటీవల అమెరికాలో H-1B వీసా ఫీజు $215 నుంచి $10,000కి పెరిగిన వార్తతో భారతీయులు ఆశ్చర్యంలో పడిన సంగతి తెలిసిందే. UAE మాత్రం భారతీయులకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న గమ్యస్థానం. 2024లో సుమారు 78 లక్షల భారతీయులు UAEని సందర్శించారు. ఈ కొత్త వీసా విధానంలో పూర్తి వివరాలు, కొత్త కేటగిరీలు, నిబంధనలు ఏవిటో తెలుసుకోవడానికి వలసదారులు, ఉద్యోగార్థులు, పర్యాటకులు అందరూ దృష్టి సారించాల్సిన సమయం ఇది.