Loading...
UK Breakup: ఇంగ్లాండ్‌ ఒంటరి కానుందా?.. యూకే నుంచి బయటపడేందుకు మూడు దేశాల నిర్ణయం
ఇంగ్లాండ్‌ ఒంటరి కానుందా?.. యూకే నుంచి బయటపడేందుకు మూడు దేశాల నిర్ణయం

UK Breakup: ఇంగ్లాండ్‌ ఒంటరి కానుందా?.. యూకే నుంచి బయటపడేందుకు మూడు దేశాల నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాలను ఆక్రమించుకుని, 'రవి అస్తమించని సామ్రాజ్యం'గా పేరొందిన యునైటెడ్ కింగ్‌డమ్‌ (UK) ప్రభ క్రమంగా మసకబారుతోంది. తాజాగా యూకేలో భాగంగా ఉన్న మూడు దేశాలు స్వయం ప్రతిపత్తి దిశగా అడుగులు వేస్తుండటం ఆ దేశ ఐక్యతపై చర్చకు దారితీస్తోంది. వేల్స్‌, స్కాట్‌లాండ్‌, నార్తర్న్ ఐర్లాండ్‌ ప్రతినిధులు ఈ మేరకు తాజాగా అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

వివరాలు 

యూకే అంటే ఏమిటి?

ప్రస్తుతం బ్రిటన్‌ లేదా యూకే అని పిలిచే దేశం వాస్తవానికి నాలుగు దేశాల సమాహారం.

ఇంగ్లాండ్‌, స్కాట్‌లాండ్‌, వేల్స్‌ కలిసి 'గ్రేట్‌ బ్రిటన్‌'గా పిలవబడతాయి. వీటికి నార్తర్న్ ఐర్లాండ్‌ కూడా కలిస్తే 'యునైటెడ్ కింగ్‌డమ్‌' (UK) అవుతుంది.

ఇప్పుడు ఈ యూనియన్‌ నుంచి విడిపోయి, పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తి కలిగిన దేశాలుగా కొనసాగాలని వేల్స్‌, స్కాట్‌లాండ్‌, నార్తర్న్ ఐర్లాండ్‌ కోరుకుంటున్నాయి.

అదే జరిగితే యూకేలో ఇంగ్లాండ్‌ మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాన్నే 'యూకే బ్రేకప్‌'గా పేర్కొంటున్నారు.

రాజ్యాంగపరమైన మార్పులకు సిద్ధంగా ఉండాలని, తమ భవిష్యత్తు ఐరోపా యూనియన్‌తో ముడిపడి ఉందని ఈ మూడు దేశాల ఫస్ట్‌ మినిస్టర్లు యూకే ప్రధాని ఆండీ బర్నహామ్‌ ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టం చేశారు.

వివరాలు 

ట్రంప్‌ వ్యాఖ్యల తర్వాతే కీలక పరిణామం

వెస్ట్‌మినిస్టర్‌ (బ్రిటన్‌ పార్లమెంట్‌, ప్రభుత్వానికి కేంద్రస్థానం) ప్రాధాన్యం తగ్గుతున్న దశకు చేరుకుందనడానికి ఇంతకంటే పెద్ద సంకేతం లేదని వారు వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఐర్లాండ్‌ (రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌)పర్యటనలో భాగంగా రాజధాని డబ్లిన్‌లో మాట్లాడారు.

అవిభాజ్య ఐర్లాండ్‌ను చూడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

అది ఎప్పటికైనా జరగాల్సిందేనని, ఇప్పుడే జరిగితే మంచిదని వ్యాఖ్యానించారు. దీంతో ఐర్లాండ్‌ ఏకీకరణ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేసిన 48 గంటల్లోనే వేల్స్‌, స్కాట్‌లాండ్‌, నార్తర్న్ ఐర్లాండ్‌ ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం గమనార్హం.

సుమారు వంద సంవత్సరాల క్రితం బ్రిటన్‌ నుంచి ఐర్లాండ్‌ స్వాతంత్ర్యం పొందింది. అయితే అప్పట్లో ఐర్లాండ్‌లోని ఒక భాగమైన నార్తర్న్ ఐర్లాండ్‌ యూకేలోనే కొనసాగింది.

ADVERTISEMENT

వివరాలు 

యూకే ఐక్యతనే నమ్ముతున్నాం: ప్రధాని కార్యాలయం

మిగిలిన ప్రాంతం 'రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌'గా స్వతంత్ర దేశంగా ఏర్పడింది.

మూడు దేశాల ఫస్ట్‌ మినిస్టర్లు చేసిన వ్యాఖ్యలపై బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం స్పందించింది.

ప్రధాని యూకే ఐక్యతను విశ్వసిస్తున్నారని తెలిపింది. రాజ్యాంగపరమైన అంశాలపై చర్చలు జరపడం కంటే ప్రజల జీవన వ్యయాలను తగ్గించడంపైనే ఆయన ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని పేర్కొంది.

గతంతో పోలిస్తే ప్రస్తుతం తమ యూనియన్‌కు ముప్పు ఎక్కువగా ఉందని భావించడం లేదని కూడా ప్రధాని కార్యాలయం వ్యాఖ్యానించింది.

ADVERTISEMENT

వివరాలు 

'యూకే బ్రేకప్‌'కు దారితీస్తున్న కారణాలివే

వేల్స్‌, స్కాట్‌లాండ్‌, నార్తర్న్ ఐర్లాండ్‌లోని ప్రజల్లో కొంతకాలంగా స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక గుర్తింపు అంశాలపై ఆసక్తి పెరుగుతోంది.

తమ సంస్కృతులను కాపాడుకునేలా సొంత నిర్ణయాలు తామే తీసుకోవాలని వారు భావిస్తున్నారు.

వెస్ట్‌మినిస్టర్‌ విధానాలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా లేవన్న అభిప్రాయం కూడా ఆయా ప్రాంతాల్లో ఉంది.

వివరాలు 

స్కాట్‌లాండ్‌: బ్రెగ్జిట్‌పై అసంతృప్తి

స్కాట్‌లాండ్‌ ప్రజల్లో చాలామంది ఐరోపా యూనియన్‌లోనే కొనసాగాలని కోరుకున్నారు.

అయితే బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బయటకు రావడం (బ్రెగ్జిట్‌) వారికి నచ్చలేదు.

దీంతో యూకే నుంచి విడిపోయి, తమ భవిష్యత్తుపై తామే నిర్ణయాలు తీసుకోవాలనే డిమాండ్లు బలపడ్డాయి.

అలాగే స్కాట్‌లాండ్‌లోని చమురు సంపదపై నిర్ణయాధికారం తమకే ఉండాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

సహజ వనరుల వినియోగం, ఆదాయంపై తమకు మరింత నియంత్రణ ఉండాలని వారు భావిస్తున్నారు.

వివరాలు 

నార్తర్న్ ఐర్లాండ్‌: రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌తో కలవాలనే ఆకాంక్ష

నార్తర్న్ ఐర్లాండ్‌లోని చాలామంది ప్రజలు పక్కనే ఉన్న రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌తో తిరిగి కలవాలని కోరుకుంటున్నారు.

బ్రిటన్‌ పాలన నుంచి వేరుపడి, గతంలో తమకున్న ఐరిష్‌ గుర్తింపును తిరిగి పొందాలనే ఆకాంక్ష అక్కడి కొన్ని వర్గాల్లో ఉంది.

అదే సమయంలో బ్రెగ్జిట్‌ కారణంగా వాణిజ్యపరంగా నష్టపోతున్నామని నార్తర్న్ ఐర్లాండ్‌లోని ప్రజల్లో కొంతమంది భావిస్తున్నారు.

యూకే నుంచి విడిపోవడం ద్వారా ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని వారు ఆశిస్తున్నారు.

వివరాలు 

వేల్స్‌: భాష, సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు

వేల్స్‌ ప్రజలు తమ చట్టాలను తామే రూపొందించుకోవాలని కోరుకుంటున్నారు.

తమకంటూ ప్రత్యేకమైన భాష, సంస్కృతి ఉన్నందున వాటిని మరింత బలంగా కాపాడుకోవాలని ఆశిస్తున్నారు.

వెస్ట్‌మినిస్టర్‌ కేంద్రంగా తీసుకునే నిర్ణయాల కంటే, వేల్స్‌ అవసరాలకు అనుగుణంగా స్థానికంగా నిర్ణయాలు తీసుకునే అధికారం తమకుండాలని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.

ఈ కారణంగానే స్వయం ప్రతిపత్తి అంశం వేల్స్‌లో ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

ADVERTISEMENT