Russian oil: రష్యాలోని మరో ఆయిల్ ఫెసిలిటీపై దాడి.. డ్రోన్ శక్తిని చూపిస్తున్న ఉక్రెయిన్..
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా ఆగకుండా కొనసాగుతోంది. ఇరు దేశాలు పరస్పరం దాడులు, ప్రతిదాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. తాజాగా రష్యాలో మరో ముఖ్యమైన చమురు కేంద్రం లక్ష్యంగా మారింది. క్రెయిన్ డ్రోన్ దాడులే దీనికి కారణం. రష్యాలోని పెర్మ్ ప్రాంతంలో ఉన్న కీలక చమురు పంపింగ్ కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసినట్లు సమాచారం. ఈ పెర్మ్ ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సుమారు 1500 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. ఇంత దూరం వరకూ దాడి చేయగలిగిన సామర్థ్యాన్ని ఉక్రెయిన్ పెంచుకున్నట్లు ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. తమ దేశం నిర్వహించిన అత్యంత దూర డ్రోన్ విమాన దాడి ఇదేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.
వివరాలు
రష్యా మౌలిక వసతులపై వరుస దాడులు
రష్యా చమురు సరఫరా వ్యవస్థలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుండటంతో, ఈ దాడి ప్రభావం గణనీయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ రష్యాచమురు రంగాన్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోంది. శుద్ధి కేంద్రాలు, నిల్వ ప్రాంతాలు,నౌకాశ్రయాలు వంటి కీలక ఇంధన మౌలిక వసతులపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఇక మరోవైపు,ఉక్రెయిన్ పౌర ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈశాన్యంలోని ఖర్కివ్ ప్రాంతంపై జరిగిన దాడుల్లో ఎనిమిది మంది గాయపడినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన డ్రోన్ విమానాలను అడ్డుకున్నామని వారు తెలిపారు. అయితే,పెర్మ్ ప్రాంతంలోని చమురు కేంద్రంపై జరిగిన ఉక్రెయిన్ దాడి విషయంపై రష్యా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జెలెన్‌స్కీ చేసిన ట్వీట్
A report by Major General Yevhenii Khmara on our long-range sanctions – a new stage in the use of Ukrainian weapons to limit the potential of Russia’s war. I am grateful to the guys from the Security Service of Ukraine for their precision.
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) April 29, 2026
The straight-line distance is over… pic.twitter.com/8wFRJ6cE8R