Gaza plan: ట్రంప్ గాజా ప్లాన్‌కు ఐక్యరాజ్యసమితి గ్రీన్‌సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు తెచ్చిన గాజా శాంతి ప్రణాళికకు మండలి ఆమోదం తెలిపింది. మొత్తం 20 విషయాలతో రూపుదిద్దుకున్న ఈ ప్రణాళికలో యుద్ధ విరామం అమలు నుంచి పునర్నిర్మాణం వరకూ,అంతర్జాతీయ బలగాల నియోగం నుంచి పాలనకు సంబంధించిన మార్గదర్శకాలు వరకూ స్పష్టమైన వివరాలు ఉన్నాయి. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం జరిగిన ఓటింగ్‌లో అమెరికా,యూకే, ఫ్రాన్స్,సోమాలియా సహా 13 దేశాలు మద్దతు తెలిపాయి. వీటో హక్కు కలిగిన రష్యా, చైనా ఓటింగ్‌లో తటస్థంగా ఉన్నారు. గత నెలలోనే యుద్ధ విరామం,బందీల విడుదలతో ప్రణాళిక తొలి దశ అమలయ్యింది.
వివరాలు
హమాస్ ఆగ్రహం
గాజా పునర్నిర్మాణ పనులు పర్యవేక్షించేందుకు "బోర్డ్ ఆఫ్ పీస్" పేరుతో ఒక తాత్కాలిక సంస్థను ఏర్పాటు చేయాలన్నదే ఈ ప్లాన్ ఉద్దేశం. అంతర్జాతీయ స్థిరీకరణ దళాలు.. అంటే ఐరాస లేదా అంతర్జాతీయ సమూహం ఆధ్వర్యంలో పనిచేసే బలగాలు.. గాజాలో శాంతి నెలకొల్పడం, భద్రతను పరిరక్షించడం, యుద్ధ విరామాన్ని కచ్చితంగా అమలు చేయించడం, పునర్నిర్మాణ చర్యలకు సహకరించడం వంటి బాధ్యతలు చేపట్టనున్నాయి. అయితే హమాస్ ఈ తీర్మానాన్ని గట్టిగా వ్యతిరేకించింది. ఇది గాజా ప్రజల స్వతంత్రతను దెబ్బతీసే ప్రయత్నమని ఆరోపించింది. పాలస్తీనీయుల హక్కులను ప్రణాళిక పట్టించుకోలేదని, గాజాపై అంతర్జాతీయ పాలన రుద్దడానికే దీనికి రూపమిచ్చారని పేర్కొంది.
వివరాలు
హమాస్ ఆగ్రహం
"ఈ తీర్మానం పాలస్తీనా ప్రజల స్వాతంత్ర్యం, స్వయంపాలన హక్కులకు విరుద్ధం. స్థానికుల రాజకీయ ఆశయాలను పక్కన పెట్టి తాత్కాలిక పాలనా వ్యవస్థ పేరిట బయటి దేశాల నిర్ణయాలను అమలు చేయాలన్న భావన కనిపిస్తోంది. గాజా భవిష్యత్తు గాజా ప్రజల చేతుల్లోనే ఉండాలి; విదేశీ బలగాలు లేదా బాహ్య సంస్థలు తమ అభిప్రాయాలను రుద్దకూడదు" అని ఒక ప్రకటన విడుదల చేసింది.
వివరాలు
ట్రంప్ స్పందన
ఈ తీర్మానాన్ని ట్రంప్ 'ఐరాస చరిత్రలో అత్యంత ప్రాముఖ్యతగల ఆమోదం'గా చెప్పారు. "బోర్డ్ ఆఫ్ పీస్"కు తానే అధ్యక్షత వహించనున్నట్టు, ప్రపంచంలోని కీలక నేతలు ఇందులో భాగస్వాములు కాబోతున్నట్టు వెల్లడించారు. దీనితో గాజా శాంతి ఒప్పందాన్ని తన నాయకత్వ విజయంగా చూపించడంతో పాటు, గాజా భవిష్యత్తు అమెరికా ఆధ్వర్యంలో రూపుదిద్దుకోబోతోందని ఆయన సంకేతాలిచ్చారు.
వివరాలు
నెతన్యాహు తిరస్కరణ
ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం పాలస్తీనా స్థాపన ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరిస్తున్నారు. అది హమాస్‌కు ఒక రకమైన బహుమతిలాంటిదేనని, ఆ నిర్ణయం ఇజ్రాయెల్ సరిహద్దులకు మరింత ప్రమాదకరమని భావిస్తున్నట్లు తెలిపారు. హమాస్ తప్పనిసరిగా ఆయుధాలు వదలాలని, అవసరమైతే తమ ప్రత్యేక శైలిలో అయినా ఆ లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన హెచ్చరించారు.