Harvard University: హార్వర్డ్ క్యాంపస్‌లో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన క్యాంపస్‌లో గుర్తుతెలియని ఒక దుండగుడు కాల్పులకు పాల్పడినట్లు తెలిసింది. అయితే, పోలీసులు తెలిపినట్లుగా ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. శుక్రవారం సాయంత్రం షెర్మన్ స్ట్రీట్‌లోని డానేహా పార్క్, హార్వర్డ్‌లోని రాడ్‌క్లిఫ్ క్వాడ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైకిల్‌పై వచ్చిన దుండగుడు ఒకరిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు సమాచారం. సంఘటనపై సమాచారం అందగానే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు.
Details
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు
కాల్పుల సమయంలో విశ్వవిద్యాలయం విద్యార్థులు, సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసింది. ఎవరూ బయటకు రాకుండా ఉండాలని, అప్రమత్తంగా ఉండి ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించిన వెంటనే పోలీసులు లేదా సంబంధిత అధికారులు అవగాహన పొందేలా వ్యవహరించాలని సూచించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దుండగుడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.