Loading...
Sheikh Hasina: బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ కోసం షేక్ హసీనా దరఖాస్తు.. అత్యవసర నిర్ణయానికి విజ్ఞప్తి
అత్యవసర నిర్ణయానికి విజ్ఞప్తి

Sheikh Hasina: బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్ కోసం షేక్ హసీనా దరఖాస్తు.. అత్యవసర నిర్ణయానికి విజ్ఞప్తి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కొత్త పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డు (ఎన్‌ఐసీ) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు ఆమె తరఫు న్యాయవాది అధికారికంగా లేఖ రాశారు. తన దరఖాస్తుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. మీడియా కథనాల ప్రకారం.. లండన్‌కు చెందిన ప్రముఖ బారిస్టర్ స్టీవెన్ పౌల్స్ ద్వారా షేక్ హసీనా ఈ విజ్ఞప్తిని పంపించారు. నవంబర్ 9న తొలిసారి దరఖాస్తు చేసినప్పటికీ, హైకమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నవంబర్ 19న ఆయన మరోసారి ఫాలోఅప్ లేఖ పంపారు.

వివరాలు 

2024లో భారత్‌కు షేక్ హసీనా

ఈ సందర్భంగా హసీనా స్వయంగా సంతకం చేసిన అధికార పత్రాన్ని (ఆథరైజేషన్ లెటర్) కూడా జత చేశారు.

ఆమె దరఖాస్తుపై అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

2024లో బంగ్లాదేశ్‌లో చెలరేగిన ప్రజా ఉద్యమం నేపథ్యంలో షేక్ హసీనా భారత్‌కు వచ్చారు.

ప్రస్తుతం ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. డిసెంబర్‌లో తిరిగి స్వదేశానికి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో రద్దయిన పత్రాల స్థానంలో కొత్త పాస్‌పోర్ట్, జాతీయ గుర్తింపు కార్డు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

వివరాలు 

హసీనా విజ్ఞప్తిని తిరస్కరించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

మరోవైపు షేక్ హసీనా కొత్త పాస్‌పోర్ట్ కోసం చేసిన విజ్ఞప్తిని బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది.

మానవతా వ్యతిరేక నేరాలకు సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించిందని అధికారులు పేర్కొన్నారు.

పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఉన్న గడువు కూడా ఇప్పటికే ముగిసిపోయిందని వెల్లడించారు.

హసీనా దోషిగా తేలినందున ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పాస్‌పోర్ట్ జారీ చేయబోమని బంగ్లాదేశ్ చీఫ్ ప్రాసిక్యూటర్ అమీనుల్ ఇస్లాం, న్యాయశాఖ మంత్రి స్పష్టం చేశారు.

భారత్‌తో బంగ్లాదేశ్‌కు ఉన్న ద్వైపాక్షిక నేరస్థుల అప్పగింత ఒప్పందం ద్వారా ఆమెను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

ఆ తర్వాత చట్ట ప్రకారం శిక్షను అమలు చేస్తామని బంగ్లాదేశ్ వర్గాలు పేర్కొన్నాయి.

ADVERTISEMENT