విమానంలో గాల్లో ఉండగానే బెంబెలెత్తిన ప్రయాణికులు..వేగంగా 28 వేల అడుగులకు దూసుకొచ్చిన ఫ్లైట్
విమానం ఆకాశంలో ఉండగానే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ మేరకు యునైటెడ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 10 నిమిషాల్లోనే ఏకంగా 28 వేల అడుగుల కిందకు వేగంగా దిగడంతో ప్రయాణికులు బెంబెలెత్తిపోయారు. బుధవారం నెవార్క్ నుంచి రోమ్ కి బయలుదేరిన విమానంలోని క్యాబిన్ ప్రెజర్ లో లోపం తలెత్తింది. బోయింగ్ 777 విమానంలో 270 మంది ప్రయాణికులు,14 మంది సిబ్బంది ఉన్నట్లు విమానయాన ప్రతినిధి పేర్కొన్నారు. మౌయి లోని నెవార్క్ లిబర్టీ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే సమస్య తలెత్తింది. దీంతో 10 నిమిషాల్లోనే 28 వేల అడుగుల కిందకు దించేశామన్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికులను మరో విమానంలో తమ గమ్యస్థానాలకు తరలించామని స్పష్టం చేశారు.ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సైతం ఘటనను ధ్రువీకరించింది.