LOADING...
Trump Tariffs: ట్రంప్‌కు భారీ ఊరట.. 10% గ్లోబల్ సుంకాల వసూలుకు కోర్టు గ్రీన్ సిగ్నల్
ట్రంప్‌కు భారీ ఊరట.. 10% గ్లోబల్ సుంకాల వసూలుకు కోర్టు గ్రీన్ సిగ్నల్

Trump Tariffs: ట్రంప్‌కు భారీ ఊరట.. 10% గ్లోబల్ సుంకాల వసూలుకు కోర్టు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు టారిఫ్‌ల వ్యవహారంలో కీలక ఊరట లభించింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై ఆయన విధించిన 10 శాతం గ్లోబల్ సుంకాలను కొనసాగించేందుకు వాషింగ్టన్‌లోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఆ సుంకాల వసూలు కొనసాగనున్నట్లు స్పష్టమైంది. గత ఏడాది భారత్‌తో పాటు పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై ట్రంప్ భారీ సుంకాలు విధించారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. అనంతరం ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్ 122ను వినియోగించిన ట్రంప్ ప్రభుత్వం, జులై 24 వరకు అమల్లో ఉండేలా 10 శాతం తాత్కాలిక గ్లోబల్ సుంకాలను అమలు చేసింది.

వివరాలు 

సుప్రీంకోర్టు తుది తీర్పు ఈ వ్యవహారంలో కీలకం

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు వ్యాపార సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ కేసును విచారించిన న్యూయార్క్ ఫెడరల్ కోర్టు,అమెరికా రాజ్యాంగం ప్రకారం సుంకాలను విధించే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేయడంతో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ట్రంప్ యంత్రాంగం ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టును ఆశ్రయించింది. అప్పీల్‌ను పరిశీలించిన కోర్టు తాత్కాలిక 10 శాతం గ్లోబల్ సుంకాల వసూలును కొనసాగించవచ్చని తీర్పునిచ్చింది. దీంతో ట్రంప్ ప్రభుత్వానికి న్యాయపరంగా కీలక ఊరట లభించినట్లైంది. ఇదిలా ఉండగా, ఈ టారిఫ్‌ల వివాదం ఇంకా ముగియలేదని, దీనిపై అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు న్యాయ నిపుణులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తుది తీర్పు ఈ వ్యవహారంలో కీలకంగా మారనుంది.

Advertisement