H-1B visas: షాకింగ్.. హెచ్-1బీ వీసాలకు మూడేళ్లు బ్రేక్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న లక్షలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ఆందోళన కలిగించే కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్-1బీ వీసాల మంజూరు ప్రక్రియను మూడు సంవత్సరాల పాటు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రిపబ్లికన్ ప్రతినిధి ఎలీ క్రేన్ బుధవారం చట్టసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. 'ఎండ్ హెచ్-1బీ వీసా అబ్యూజ్ యాక్ట్ ఆఫ్ 2026' పేరుతో ఈ ప్రతిపాదనను ఆయన ముందుకు తెచ్చారు.
వివరాలు
భారతీయులకు షాక్..
మూడేళ్ల విరామం అనంతరం ఈ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించే సమయంలో విస్తృతమైన సంస్కరణలు చేపట్టి, వీసాల జారీ వ్యవస్థను సమూలంగా మార్చాలని ఆయన సూచించారు. ఈ బిల్లుకు పలువురు రిపబ్లికన్ సభ్యులు మద్దతు ప్రకటించారు. అదేవిధంగా, హెచ్-1బీ వీసాల వార్షిక పరిమితిని ప్రస్తుతం ఉన్న 65 వేల నుంచి 25 వేలకే తగ్గించాలని బిల్లులో పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మినహాయింపులను కూడా రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఇకపై హెచ్-1బీ వీసా పొందాలంటే కనీస వార్షిక వేతనం 2 లక్షల డాలర్లు ఉండాలని కూడా సూచించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్:
STORY | Bill for 3-year pause on H-1B visas introduced in US Congress
— Press Trust of India (@PTI_News) April 25, 2026
A group of Republican lawmakers has introduced a bill in the US Congress for a three-year pause to the H1-B visa programme, contending that it has been hijacked to replace American workers with cheap foreign… pic.twitter.com/C36E5ROE1q